మాజీమంత్రికి మళ్లీ మంత్రి పదవి... ముందే ప్రకటించిన వైఎస్ జగన్

Update: 2019-04-03 12:11 GMT

ఏపీలో ఎన్నికల పొలింగ్‌కు సరిగ్గా వారం అంటే వారం మాత్రమే మిగిలి ఉంది. ఏపీలో ఎన్నికల రణరంగంలో ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలు ఉన్నా కానీ హోరాహోరీ పోటీ మాత్రం వైసీపీ, టీడీపీ మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయనే ఊహాగానాలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే ఈ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో ఫుల్ బీజీబీజీగా ఉన్నారు. అటు టీడీపీ కూడా ఈసారి ఏపీలో మళ్లీ పసుపు జెండా ఎగరవేస్తామని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం వైసీపీ గెలిస్తే జగన్ ఎవరికి మంత్రి పదవులు ఇస్తారనే ముచ్చట కూడా ముందుగానే చెప్పేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆశీర్వదించమని కోరిన వైఎస్‌ జగన్‌ వాసు అన్నను మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. ఒంగోలులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఒంగోలు రహదారులు కిక్కిరిసిపోయాయి. మండుతున్న ఎండలను లెక్కచేయకుండా అక్కడికి తరలివచ్చిన వారికి వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఏ విధంగా దోపిడి చేస్తున్నారో గమనించండి. పేదవాడికి ఇళ్లు కట్టిస్తున్నామని చెప్పి ప్రజలను నట్టేటా ముంచారని ధ్వజమెత్తారు.

Similar News