నిజాలు బయటికి రావాలంటే సీబీఐ విచారణ తప్పనిసరి: జగన్

Update: 2019-03-16 11:55 GMT

వైసీపీ అధినేత జగన్ మోహన్‌ రెడ్డి రాజ్‌భవన్‌లో గవర్నర్ ను కలిశారు. జగన్ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌కు వైసీపీ బృందం రాజ్‌భవన్‌కు వెళ్లింది. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ వద్దని సీబీఐతో విచారణ జరిపించాలని జగన్‌ గవర్నర్‌కు విన్నవించారు. ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ టీడీపీకి వాచ్‌మెన్‌గా మారిందని, ఏపీలో పోలీస్‌ వ్యవస్థ టీడీపీ ప్రభుత్వానికి తొత్తుగా మారిందని జగన్ మెహన్ రెడ్డి ‎ఆరోపించారు. చంద్రబాబు హస్తం లేకుండా సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని జగన్ ప్రశ్నించారు. రెండ్రోజుల్లో సీబీఐ విచారణ వేయకపోతే కోర్టును ఆశ్రయిస్తాం జగన్‌ అన్నారు. హత్య కేసులో నిజాలు బయటికి రావాలంటే సీబీఐ విచారణ తప్పనిసరి అని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 

Similar News