చంద్రబాబుకు జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

Update: 2019-04-20 05:33 GMT

69వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్‌ ద్వారా ఆయన శుభకాంక్షలు తెలియజేశారు. ఇక చంద్రబాబు జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. విజయవాడలో పార్టీ నేత గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 69 కేజీల కేక్‌ను కట్ చేశారు. పసుపు రంగు చీరలతో వేడుకలకు హాజరైన మహిళలు చంద్రబాబు మరోసారి అధికారంలోకి వస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు.    

Similar News