రైతు బంధు, రైతుబీమా పథకాలను ప్రకటించిన జగన్

తాను అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్నీ జిల్లాగా మారుస్తానని చెప్పారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ తరహాలో రైతు బంధు, రైతు భీమా తరహా పథకాలను అమలు చేస్తామని అన్నారు.

Update: 2019-01-09 12:47 GMT

తాను అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్నీ జిల్లాగా మారుస్తానని చెప్పారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ తరహాలో రైతు బంధు, రైతు భీమా తరహా పథకాలను అమలు చేస్తామని అన్నారు. రైతులకు బీమా ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుందని, ప్రతి రైతుకూ వడ్డీలేని రుణాలు అందిస్తానని అన్నారు. ఏడాదికి 12వేల 500 చొప్పు,న పెట్టుబడి నేరుగా అందిస్తానని, పగటిపూట 9గంటల విద్యుత్‌ను ఉచితంగా రైతులకు అందిస్తానని హామీలిచ్చారు జగన్. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభలో మాట్లాడారు.

గత ఏడాది 2017 నవంబర్‌ 6వ తేదీన ఇడుపులపాయ నుంచి చేపట్టిన 'ప్రజా సంకల్పయాత్ర'శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. మొత్తం 341 రోజుల పాటు సాగిన ప్రజాసంకల్పయాత్ర 134 నియోజకవరాగలు, 231 మండలాలు, 2,516 గ్రామాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల గుండా సాగింది.

Similar News