తెలంగాణ భవన్‌‌లో కేటీఆర్‌ కీలక సమావేశం

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌‌ పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టిన కేటీఆర్‌‌ ముఖ్యనేతలు, కేడర్‌‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ భవన్‌‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన కేటీఆర్‌‌ పంచాయతీ, పార్లమెంట్‌ ఎన్నికలు, పార్టీ కార్యాలయాల నిర్మాణం, ఓటరు నమోదు తదితర అంశాలపై చర్చిస్తున్నారు.

Update: 2018-12-28 11:44 GMT
ktr

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌‌ పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టిన కేటీఆర్‌‌ ముఖ్యనేతలు, కేడర్‌‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ భవన్‌‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన కేటీఆర్‌‌ పంచాయతీ, పార్లమెంట్‌ ఎన్నికలు, పార్టీ కార్యాలయాల నిర్మాణం, ఓటరు నమోదు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి యాక్షన్ ప్లాన్‌ మొదలుపెట్టిన కేటీఆర్‌ ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండు వేలమంది ముఖ్యకార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలకు ఆదేశాలిచ్చారు. లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక ప్రధాన కార్యదర్శికి బాధ్యతలు అప్పగించారు. అలాగే పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కేటీఆర్‌‌ అన్ని గ్రామాల్లో గులాబీ జెండా ఎగిరేలా వ్యూహరచన చేస్తున్నారు.

ఓటర్ల నమోదుపై ప్రత్యేకంగా దృష్టిసారించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు వచ్చేలా పనిచేయాలని పార్టీ నేతలకు కేటీఆర్ సూచించారు. ఓటరు నమోదు, సవరణకు జనవరి 6వరకు అవకాశం ఉన్నందున టీఆర్‌ఎస్‌ శ్రేణులంతా ఇందులో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలక్లో గల్లంతైన ఓటర్లపైనా దృష్టిపెట్టాలని కేడర్‌‌కు సూచించారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయి పర్యటనలకు కూడా కేటీఆర్‌‌ శ్రీకారం చుట్టారు‌‌. ఇప్పటికే సిరిసిల్ల, వరంగల్‌‌లో పర్యటించిన కేటీఆర్‌‌ త్వరలోనే అన్ని జిల్లాలను చుట్టేయనున్నారు. ఎక్కడికక్కడ నేతలు, కార్యకర్తలతో సమావేశమై పంచాయతీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడేలా పనిచేయాలంటూ కేడర్‌‌కు దిశానిర్దేశం చేయనున్నారు.  

Similar News