అడవిలో బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి

Update: 2019-05-21 09:02 GMT

రాకెట్ ప్రయోగాలతో అంతరిక్షంలోకి దూసుకుపోతున్నాం. కొత్త కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి తెచ్చుకుంటున్నాం. అభివృద్ధిలో ఇతర దేశాలతో పోటీ పడుతున్నాం. అయితే ఇప్పటికీ మారుమూల గ్రామాలకు వైద్య సేవలు అందించలేని దుస్థితి. గ్రామంలో కనీసం పీహెచ్‌సీ కూడా లేకపోవడంతో మార్గమధ్యలోనే ప్రసవం జరిగిన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.

విశాఖ జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతిలోని మారుమూలను ఉంది సంకుపర్తి గ్రామం. అడవిలో ఉండే ఈ గ్రామానికి కనీసం రోడ్డు మార్గం కూడా లేదు. 6 కిలోమీటర్లు అడవిలో నడిస్తేనే పీహెచ్‌సీకి చేరుకోగలం. ఇలాంటి ఈ ఊరిలో ప్రసవం కోసం ఓ తల్లి నరకం చూసింది. ఒక్కసారిగా ప్రసవం నొప్పులు మొదలు కావడంతో ఆసుపత్రికి బయలు దేరింది. అయితే అడవి మధ్యలోనే కాన్పు జరిగిపోయింది. ఎటువంటి వైద్య సహాయం లేకుండానే బిడ్డను కన్నది ఆ తల్లి. ఊరిలో ఎవరికైనా ప్రాణాలమీదకు వస్తే ఆరు కిలోమీటర్లు వెళ్లాల్సిందే.

Similar News