ఎన్నికల కోడ్ ఉందనే కారణంతో ప్రభుత్వం నిద్రపోవాలా : కనకమేడల

Update: 2019-04-20 10:04 GMT

ఎన్నికల కోడ్ ఉందనే కారణంతో రెండు నెలల పాటు ప్రభుత్వం నిద్ర పోవాలా అని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్. ఈసీ ఆంక్షలున్నాయనే కారణంతో ప్రజా ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా చూస్తూ ఊరుకోవాలా అని నిలదీశారు. ఎన్నికల కోడ్ ఉందనే కారణంతో ప్రభుత్వం నిద్రపోవాలా : కనకమేడలఈసీ తీరు చూస్తోంటే అత్యవరాల్ని సైతం పట్టించుకోవద్దనే ధోరణి కనిపిస్తోందని కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూలను ప్రతిపక్షం తప్పుపట్టడం చాలా దారుణమని కనకమేడల వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని, రాజ్‌నాథ్ రివ్యూలకు అడ్డంరాని కోడ్‌ చంద్రబాబుకే వస్తుందా? అని ప్రశ్నించారు. ఏపీలో ఉన్నది ఎన్నికైన ప్రభుత్వం, కేర్‌ టేకర్‌ ప్రభుత్వం కాదన్నారు. 

Similar News