ఇక ఏటీఎంలో డబ్బులు లేకపోతే బ్యాంకులకు జరిమానే..

Update: 2019-06-14 13:00 GMT

నోట్ల రద్దు తర్వాత సరిగ్గా ఏటీఎంలో డబ్బులు ఉండడం మనం చూసి చాలా రోజులు అవుతుంది.. ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులు మాత్రమే కనిపిస్తూనే ఉంటాయి. దీనితో కొందరికి కొన్ని బ్యాంకుల పైన నమ్మకం పోతుంది అంటే అతిశయోక్తి కాదు .. అయితే ఇలాంటి భాదలు ఉండవు .. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంక్ ఏటీఎం వినియోగదారులకు తీపికబురు తీసుకువచ్చింది. బ్యాంకులు వాటి ఏటీఎంలను డబ్బులతో నింపకపోతే ఇక పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్‌బీఐ ఈమేరకు బ్యాంకులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. బ్యాంకులు మూడు గంటల కన్నా ఎక్కువసేపు ఏటీఎంలను ఖాళీగా ఉంచూడదు. ఇలా జరిగితే జరిమానాలు కట్టాల్సిందే. 

Tags:    

Similar News