రాజ్యసభలో సభ్యుల రగడ

ప్రతిపక్షాల ఆందోళనలతో రాజ్యసభలో ఇవాళ తీవ్ర గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘‘వుయ్ వాంట్ జస్టిస్’’ అని బిగ్గరగా నినాదాలు చేయడంతో ఎవరి మాట ఎవరికీ అర్థంకాని పరిస్థితి నెలకొంది.

Update: 2018-12-31 06:50 GMT
rajya Sabha

ప్రతిపక్షాల ఆందోళనలతో రాజ్యసభలో ఇవాళ తీవ్ర గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ''వుయ్ వాంట్ జస్టిస్'' అని బిగ్గరగా నినాదాలు చేయడంతో ఎవరి మాట ఎవరికీ అర్థంకాని పరిస్థితి నెలకొంది. దీంతో సభాకార్యకలాపాలు పట్టుమని పావుగంట కూడా నడవలేదు. రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు.

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ ప్రారంభం కానున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రతిపక్షాల అభ్యంతరాలను పట్టించుకోకుండానే లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును నెగ్గించుకోగా రాజ్యసభలో మాత్రం ప్రతిపక్షాల బలం అధికంగా ఉండడంతో ఇది గట్టెక్కుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లును జాయింట్ సెలక్షన్ కమిటీకి పంపాల్సిందేనని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. ఈ మేరకు చేసిన తీర్మానంపై ఇప్పటికే 11 పార్టీలు సంతకాలు చేశాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చకు ముందు ఈ తీర్మానంపై ఓటింగ్ జరపాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Similar News