నేడు వాయనాడ్‌లో రాహుల్ నామినేషన్

Update: 2019-04-04 03:34 GMT

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతోపాటు ఈసారి కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు వాయనాడ్ ఎంపీ స్థానానికి రాహుల్ నామినేషన్ దాఖలు చేస్తారు. రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమానికి ఆయన సోదరి, తూర్పు ఉత్తరప్రదేశ్ ఏఐసీసీ ఇన్‌చార్జి ప్రియాంక గాంధీ హాజరవుతారు. రాహుల్ గాంధీ నామినేషన్ సందర్భంగా రోడ్ షో ఉంటుందని, అంతకుముందు వేలాది మంది పార్టీ కార్యకర్తలతో కలసి నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారని పార్టీ నేతలు తెలిపారు.  

Similar News