అమర జవాను భార్యకు అత్తవారింట 'పెళ్లి వేధింపులు'

Update: 2019-02-28 08:38 GMT

ఫిబ్రవరి 14 న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిని దేశం ఇంకా మరువనేలేదు. కానీ ఈ ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన అమరవీరుని భార్యకు అత్తవారింట్లో కష్టాలు మొదలయ్యాయి. కేవలం ఘటన జరిగి పక్షం రోజులలోపే ఇలా జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే...పుల్వామా ఉగ్రదాడిలో కర్నాటకలోని మాండ్యాకు చెందిన హెచ్ గురు అమరులయ్యారు. అయితే ఇప్పడు అతని భార్య కళావతి(25)కి ఆమె మరిదితో వివాహం జరిపించాలని అత్తవారింటివారు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఆమెకు ప్రభుత్వం తరపున అందే భారీ ఆర్థికసాయాన్ని దక్కించుకునేందుకే ఇలా చేస్తున్నారని సమాచారం. ఈ నేపధ్యంలో కళావతి మాండ్యా పోలీసులను ఆశ్రయించారు. కాగా సినీనటి సుమలత కూడా అమరజవాను హెచ్ గురు కుటుంబానికి అర ఎకరం భూమి ఇచ్చేందుకు హామీనిచ్చారు. కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలావుండగా అమర జవాను భార్య కళావతికి ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలని కర్నాటక సీఎం కుమారస్వామి ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Similar News