నవ భారత నిర్మాణమే లక్ష్యం : రాష్ట్రపతి

Update: 2019-01-31 06:42 GMT

కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ నాలున్నరేళ్ల ప్రగతిని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ వివరించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ప్రధాని మోడీ ఆధ్వర్యంలో సాగిన పాలనను తెలియజేశారు. నవ భారత నిర్మాణం దిశగా దేశం అడుగులు వేస్తోందన్న ఆయన పేదరికాన్ని తొలగించేందుకు మానవీయ కోణంలో సంక్షేమ పథకాలను చేపడుతూనే అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు. పాలన చేపట్టిన తొలి రోజు నుంచి అవినీతిరహిత పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. దేశంలో యువత, మహిళలు, రైతులు, విద్యార్ధుల కోసం ప్రత్యేక పథకాలు చేపట్టామన్నారు. దేశంలోని ప్రతి ఇంటిలో వెలుగులు నింపడంతో పాటు దేశ ప్రజల ఆరోగ్యానికి భరోసానిస్తూ ఆయుష్మాన్ భారత్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. ప్రపంచ సంక్షేమ చరిత్రలోనే ఆయుష్మాన్ భారత్ అతి పెద్ద పథకమన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రతి గ్రామం, ప్రతి ఇంట్లో మరుగుదోడ్లు నిర్మించేందుకు చేయుతనిచ్చామన్నారు.   

Similar News