నయీమ్ కేసులో పోలీసులపై వేటు..

Update: 2019-03-09 16:15 GMT

నయీం కేసులో ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు పడింది. ల్యాండ్ కబ్జాలను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణలపై భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి, సీఐ వెంకన్నలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. డీసీపీ రామచంద్రారెడ్డిని రాచకొండ సీపీ కార్యాలయంలో అటాచ్ చేస్తూ సీపీ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, సీఐ వెంకన్నను యూసుఫ్‌గూడలోని ఫస్ట్ బెటాలియన్ చీఫ్ సూపరింటెండెంట్‌కు రిపోర్టు చేయాలని, పోలీస్ రిక్రూట్ మెంట్ పూర్తయ్యే దాకా అక్కడే పనిచేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. 

Similar News