జయరాం హత్య కేసులో వీడిన మిస్టరీ

Update: 2019-02-03 06:23 GMT

పారిశ్రామికవేత్త జయరామ్ హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. జయరామ్ ను తానే చంపినట్లు రాకేష్ రెడ్డి ఒప్పుకున్నాడు. 4.5కోట్ల డబ్బు వ్యవహారంలో హత్య చేశానని ఒప్పుకున్నాడు. జయరామ్ ను హైదరాబాద్ లోనే హత్య చేసి కారులో విజయవాడ వైపు తరలించినట్లు తెలిసింది.

కృష్ణాజిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర కారులో మృతదేహమై కనిపించాడు జయరామ్. సీసీటీవీ పుటేజ్‌ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. జయరాం మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు నాలుగు టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. పోలీసులు హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని జయరామ్ ఇంటి వద్ద వివరాలు సేకరించారు.

జయరామ్ మేనకోడలు శికా చౌదరిని కూడా పోలీసులు ప్రశ్నించారు. దస్ పల్లా హోటల్ లో ఫార్మ ప్రతినిధులతో జయరామ్ సమావేశమయ్యారు. ఆ తర్వాత తెల్ల చొక్క వేసుకుని ఉన్న వ్యక్తితో అక్కడి నుంచి వెళ్లినట్లు సీసీ పుటేజీలో గుర్తించారు. జయరామ్, శికా చౌదరి డ్రైవర్లను, వాచ్ మెన్లను ప్రశ్నించారు పోలీసులు.

రాకేష్ రెడ్డి శికా చౌదరికి 4.5 కోట్లు అప్పు ఇచ్చాడు. ఈ అప్పును జయరామ్ చెల్లించేందుకు ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలోనే రాకేష్ రెడ్డి జయరామ్ ను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్దారించారు. మరోవైపు జయరామ్ మృతదేహాన్ని జుబ్లీహిల్స్ లోని జయరామ్ ఇంటికి తరలించారు. ఆయన భార్య, పిల్లలు అమెరికా నుంచి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం మహా ప్రస్థానంలో జయరామ్ అంత్యక్రియలు జరుగనున్నాయి. 

Similar News