ఇక జీవితంలో మద్యం తాగను : ఎంపీ

ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. తాను మద్యం సేవించడం మానేస్తున్నట్లు స్పష్టం చేశారు. పంజాబ్‌లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా డీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవల్ సమక్షంలో భగవంత్ ఈ ప్రకటన చేశారు.

Update: 2019-01-21 08:48 GMT

ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. తాను మద్యం సేవించడం మానేస్తున్నట్లు స్పష్టం చేశారు. పంజాబ్‌లో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా డీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవల్ సమక్షంలో భగవంత్ ఈ ప్రకటన చేశారు. అయితే భగవంత్‌ మాన్‌కి విపరితంగా మందు కొట్టే అలవాటు ఉంది. అయితే ఈ మద్యం అలవాటు వల్ల చాలాసార్లు మాన్ చాలా విమర్శలను మూటకట్టుకున్నాడు. అయితే ఇదే విషయంపై భగవంత్‌ మాన్ మాట్లాడుతూ తాను ఎప్పుడో ఒక్కసారి అదైనా ఎదైనా సందర్భం ఉంటేనే తప్ప తాగుతానని చెప్పారు. కాగా ప్రతిపక్షాలు మాత్రం దీన్ని పనిగట్టుకొని మరీ తానని విమర్శించేవారని తెలిపారు. మాన్ రాత్రి, పగలు అని లేకుండా ఎల్లప్పుడు మద్యం మత్తులోనే ఉంటాడని ప్రతిక్షాలు ఆరోపించేవారు. అయితే దీనిక సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి నాకు ఉన్న మంచి పేరును చెడగొట్టాలని ప్రతిక్షాలు ప్రయత్నించేవారని ఆ వీడియోలు చూసినప్పడు నాకు భాదను కల్గిస్తుందని ర్యాలీలో వాపోయారు ఎంపీ భగవంత్ మాన్. ఇదే విషయంపై తన తల్లి కూడా నువ్వు ఎప్పుడో ఒక్కసారి తాగితే టివీల్లో మాత్రం నిత్యం చూపిస్తున్నారని చెప్పింది. దీంతో కొత్త సంవత్సరం జనవరి 1నుండి నేనోక తీర్మానం చేసుకున్నాను. ఇక నేను జీవితంలో మద్యం తాగొద్దని నిర్ణయించుకున్నానని ఇక ఇప్పటికైనా ప్రతిక్షాలు నా గురించి తప్పుడు ప్రచారం చేయకూడదనే కేజ్రీవాల్ సమక్షంలో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నని ఎంపీ భగవంత్ తెలిపారు. అయితే మాన్ నిర్ణయంపై డీల్లీ ముఖ్యమంత్రి చాలా సంతోషం వ్యక్తం చేశారు. మాన్ మార్పునకు పునాది వేశారని డీల్లీ సీఎం కేజ్రీవాల్ కొనియాడారు.

Similar News