పవన్ సీఎం కావాలి: మాయావతి

Update: 2019-03-15 10:40 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలన్నది తన అభిమతమని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. శుక్రవారం లక్నోలో మాయావతి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమైన విషయం తెలిసిందే కాగా ఈ సందర్భంగా మీడియా సమావేశంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పుని కోరుకుంటున్నారని తమ రాష్ట్రంలో కొత్త సర్కార్ రావాలనుకుంటున్నారని మాయావతి అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జనసేన, మిగిలిన వాపక్షాలతో కలిసి పోటీ చేస్తామన్నారు మాయావతి. ఏప్రిల్ 3, 4 తేదీలలో జరిగే బహిరంగ సభలలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. 

Similar News