ఈరోజు (మే-14 - గురువారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా తాజా వార్తలు ఎప్పటి కప్పుడు మీకోసం.

Update: 2020-05-14 00:37 GMT
Andhra Pradesh and Telangana updates from HMTVlive

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 14 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం. 

హైదరాబాద్ వాతావరణం : ఈరోజు హైదరబాద్ లో వాతావరణం వేడిగా ఉండే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్-గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయ్యే అవకాశం ఉంది. సూర్యోదయం 5:44 గంటలకు - సూర్యాస్తమయం సాయంత్రం 6:41 గంటలకు. గాలిలో తేమ శాతం ఈరోజు 51% ఉండొచ్చు. అదేవిధంగా ఎయిర్ క్వాలిటీ చక్కగా ఉండి 25 AQI గా నమోదు కావచ్చు.

విజయవాడ వాతావరణం : ఈరోజు హైదరబాద్ లో వాతావరణం వేడిగా ఉండే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్-గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయ్యే అవకాశం ఉంది. సూర్యోదయం 5:36 గంటలకు - సూర్యాస్తమయం సాయంత్రం 6:30 గంటలకు. గాలిలో తేమ శాతం ఈరోజు 82% ఉండొచ్చు. అదేవిధంగా ఎయిర్ క్వాలిటీ చక్కగా ఉండి 23 AQI గా నమోదు కావచ్చు.



Live Updates
2020-05-14 14:22 GMT

లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం ప్రజలకు ఇష్టారాజ్యంగా విధించిన కరెంటు బిల్లులు సవరించకపోతే సబ్ స్టేషన్లు వద్ద ధర్నా లకు దిగుతామని, ఈ విషయంలో న్యాయం జరిగే వరకు ప్రజల పక్షాన పోరాడతామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పేర్కొన్నారు.

తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరుల సమావేశంలో గద్దె మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం లాక్ డౌన్ అయ్యిందన్నారు.

జగన్ ప్రభుత్వం తమ పాండిత్యాన్ని విద్యుత్ చార్జీల పెంపుపై ఉపయోగించారన్నారు.

లాక్ డౌన్ సమయంలో ప్రజల నడ్డి విరిచే విధంగా విద్యుత్ చార్జీలు పెంచి ఇళ్లకు బిల్స్ పంపిస్తున్నారని, జనవరి, ఫిబ్రవరి నెలల్లో వందల్లో

వచ్చిన కరెంటు బిల్లు మార్చిలో ఒక్కసారిగా వేలల్లో ఎలా వస్తుంది అని ప్రశ్నించారు .?

లాక్ డౌన్ తో ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతూ, వ్యాపారాలు లేక కరోనా భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న విపత్కర పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు అధికంగా విధించి ఇళ్లకు బిల్లులు పంపడమేంటి అని ఆవేదన వ్యక్తం చేశారు.

పెంచిన విద్యుత్తు బిల్లులు తగ్గించి, ప్రజలకు ఊరట కల్పించకపోతే కరెంట్ సబ్ స్టేషన్ ల వద్ద వైకాపా ప్రభుత్వం కి వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించి, ప్రజలకు మద్దతు గా ఆందోళనలు నిర్వహిస్తామని గద్దె పేర్కొన్నారు.



 



2020-05-14 12:45 GMT

పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. అంటే పదో తరగతి విద్యార్థులు ఈసారి 6 పరీక్షలను మాత్రమే రాయాల్సి ఉంటుంది.

- పూర్తి వివరాలు 

2020-05-14 07:34 GMT

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్  తో  టీ కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవో 203 పై కృష్ణ బోర్డు కు ఈ సందర్భంగా వారు ఫిర్యాదు చేశారు. 

జిఓ 203 రద్దు చేసుకునే విదంగా ఆదేశాలు ఇవ్వాలని బోర్డు కాంగ్రెస్ నేతలు కోరారు. 

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు , రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని తమ ఫిర్యాదులో టీ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

చంద్రశేఖర్ అయ్యర్ తొ  సమావేశం అయిన వారిలో ఉత్తమ్ కుమార్, నాగం, వంశీ, సంపత్ , విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు.



 


2020-05-14 06:54 GMT

రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 36 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి.

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2100 పాజిటివ్ కేసు లకు గాను 1192 మంది డిశ్చార్జ్ కాగా, 48 మంది మరణించారు.

ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 860.

2020-05-14 06:19 GMT

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆఫీసులో కొత్తగా లీగల్ ఓఎస్దీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) గా విశ్రాంత ఐపీఎస్ అధికారి పి.హరికుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం మే 1 నుంచి అమలులోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



 





2020-05-14 05:16 GMT

హైదరాబాద్: పాపం దారితప్పి జనావాసాల్లోకి వచ్చింది. గాయపడి, అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటూ చిక్కింది ఆ చిరుత! హైదరాబాద్ కాటేదాన్ బ్రిడ్జి (జాతీయ రహదారి 7) మైలదేవరపల్లి వద్ద ఒక చిరుత పులి ప్రత్యక్షం అయింది. 

ఈ చిరుతపులి గాయంతో అక్కడ పడి ఉన్నట్టు చెబుతున్నారు. ఆ రోడ్డు మీద వెళుతున్న వాహన దారులు చిరుతపులిని చూసి భయడ్డారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.



 



2020-05-14 05:03 GMT

అమరావతి: ఇవాళ ఉదయం 11.30 గంటలకు కరోనాపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు సీఎస్‌, డీజీపీ, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అలాగే మధ్యాహ్నం3.30 గంటలకు దిశ చట్టం, డెడికేషన్‌ సెంటర్లపై సీఎం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

2020-05-14 05:01 GMT

అమరావతి : రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం చెక్ పట్టింది. ఇకపై అడ్మిషన్ల విషయంలో కటాఫ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో సెక్షన్‌లో 40 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతిఇచ్చింది. కనిష్టంగా 4 సెక్షన్లు, గరిష్టంగా 9 సెక్షన్‌లకు మాత్రమే ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్త నిబంధనలు అమలుకానున్నాయి.



 


2020-05-14 04:54 GMT

యంగ్ హీరో నిఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. తను ప్రేమించిన డా. పల్లవి వర్మను ఈ రోజు (గురువారం) ఉదయం 6:31 గంటలకు పెళ్లి చేసుకున్నాడు.

-పూర్తి వివరాలు


 

2020-05-14 04:49 GMT

చైనాలో మొదలైన కరోనా వైరస్ 195 దేశాలకి పైగా విస్తరించి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడి చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారు. మరికొందరు ఈ వ్యాధితో పోరాడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 44 లక్షల 27 వేల 900కి చేరింది.

- పూర్తి వివరాలు 

Tags:    

Similar News