నిరాడంబరంగా హీరో నిఖిల్ పెళ్లి

Arun Chilukuri
Published on: 14 May 2020 9:31 AM IST
నిరాడంబరంగా హీరో నిఖిల్ పెళ్లి
X

యంగ్ హీరో నిఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. తను ప్రేమించిన డా. పల్లవి వర్మను ఈ రోజు (గురువారం) ఉదయం 6:31 గంటలకు పెళ్లి చేసుకున్నాడు. శామీర్‌పేటలోని ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్‌లో వీరి కల్యాణ వేడుక జరిగింది. కరోనా కారణంగా అతి తక్కువ మంది బంధువులు మాత్రమే వివాహ వేడకకు హాజరయ్యారు.

ఈ ఏడాది ఫిబ్రవరి1న గోవాలో పల్లవి వర్మతో నిశ్చితార్థం చేసుకున్న నిఖిల్ వివాహాన్ని ఏప్రిల్ 16వ తేదీన జరపాలని పెద్దలు మొదట నిశ్చయించారు. అయితే లాక్ డౌన్ కారణంగా వివాహం వాయిదా పడింది.. ఆ పెళ్లిని తిరిగి మే 14వ తేదీని ఖరారు చేశారు. ఆ తరవాత కేసీఆర్ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ని మే 29 వరకు పొడిగించడంతో మరోసారి పెళ్లిని వాయిదా వేయాలని అనుకున్నారు కానీ దగ్గరలో ముహూర్తం లేకపోవడంతో ఈ ముహూర్తానికే పెళ్లి ఫిక్స్ చేశారు. కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి వేడుక జరిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story