కరెంటు బిల్లులు సవరించకపోతే సబ్ స్టేషన్ వద్ద ధర్నాలు చేపడతాం:ఎమ్మెల్యే గద్దె రామమోహన్

లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం ప్రజలకు ఇష్టారాజ్యంగా విధించిన కరెంటు బిల్లులు సవరించకపోతే సబ్ స్టేషన్లు వద్ద ధర్నా లకు దిగుతామని, ఈ విషయంలో న్యాయం జరిగే వరకు ప్రజల పక్షాన పోరాడతామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పేర్కొన్నారు.

తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరుల సమావేశంలో గద్దె మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం లాక్ డౌన్ అయ్యిందన్నారు.

జగన్ ప్రభుత్వం తమ పాండిత్యాన్ని విద్యుత్ చార్జీల పెంపుపై ఉపయోగించారన్నారు.

లాక్ డౌన్ సమయంలో ప్రజల నడ్డి విరిచే విధంగా విద్యుత్ చార్జీలు పెంచి ఇళ్లకు బిల్స్ పంపిస్తున్నారని, జనవరి, ఫిబ్రవరి నెలల్లో వందల్లో

వచ్చిన కరెంటు బిల్లు మార్చిలో ఒక్కసారిగా వేలల్లో ఎలా వస్తుంది అని ప్రశ్నించారు .?

లాక్ డౌన్ తో ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతూ, వ్యాపారాలు లేక కరోనా భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న విపత్కర పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు అధికంగా విధించి ఇళ్లకు బిల్లులు పంపడమేంటి అని ఆవేదన వ్యక్తం చేశారు.

పెంచిన విద్యుత్తు బిల్లులు తగ్గించి, ప్రజలకు ఊరట కల్పించకపోతే కరెంట్ సబ్ స్టేషన్ ల వద్ద వైకాపా ప్రభుత్వం కి వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించి, ప్రజలకు మద్దతు గా ఆందోళనలు నిర్వహిస్తామని గద్దె పేర్కొన్నారు.



 



Update: 2020-05-14 14:22 GMT

Linked news