చిన్న జీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న యడియూరప్ప

Update: 2019-08-02 07:56 GMT

కర్నాటక సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన యడియూరప్ప నేడు చినజీయర్‌ స్వామితో సమావేశమై ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. బెంగుళూరు నుంచి ఇండిగో ఎయిర్ వేస్ విమానంలో శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన యడియూరప్ప నేరుగా ముచ్చింతల్ లోని ఆశ్రమానికి కుటుంబ సమేతంగా చేరుకున్నారు. కుటుంబ సమేతంగా చినజీయర్ ఆశ్రమానికి వచ్చిన యడియూరప్పకు సాదర స్వాగతం లభించింది. సీఎం యడియూరప్పకు శాలువా కప్పి ఆశీర్వచనం అందచేశారు చిన్న జీయర్ స్వామి. కాగా రేపు చినజీయర్ నిర్వహించే యాగంలో పాల్గొననున్న యడియూరప్ప.. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశంకానున్నారు.

Tags:    

Similar News