సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సరికొత్త నిర్ణయం

కొత్త యేడాది మొదటిరోజే సరికొత్త నిర్ణయం తీసుకున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నియోజకవర్గంలో వృద్ధులు, పేదలే లక్ష్యంగా వారికి పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా మొదటి రోజే వందలాది మందికి పింఛన్ల డబ్బును పంచారు. తన సొంత సొమ్ముతో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా డబ్బులను పంచారు.

Update: 2019-01-02 10:36 GMT
Jagga Reddy

కొత్త యేడాది మొదటిరోజే సరికొత్త నిర్ణయం తీసుకున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నియోజకవర్గంలో వృద్ధులు, పేదలే లక్ష్యంగా వారికి పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా మొదటి రోజే వందలాది మందికి పింఛన్ల డబ్బును పంచారు. తన సొంత సొమ్ముతో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా డబ్బులను పంచారు.

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన జగ్గారెడ్డి కొత్త యేడాది తొలిరోజున ఓ నిర్ణయంతో ముందుకొచ్చారు. ధార్మిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఆయన న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన వృద్దులు, పేదలను ఇంటి ఆవరణలో కూర్చోబెట్టి ఇలా డబ్బులు పంచిపెట్టారు.

ఇక నుంచి ప్రతీ నెల సుమారు వెయ్యి మందికి 500 చొప్పున పెన్షన్‌ ఇస్తానని కొత్త యేడాది సందర్భంగా ప్రకటించారు. అధికారంలో ఉన్నా లేకున్నా పేదలను ఆదుకోవడంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఎమ్మెల్యేగా తనకు 3 లక్షల జీతం వస్తుందని దానికి అధనంగా మరో 2 లక్షలు కలిపి నెలకు 5 లక్షలను వృద్ధులు, పేదలకు పెన్షన్లుగా అందిస్తానని చెప్పారు.

ఎప్పుడు కనబడ్డా ఆర్థిక సహాయం చేస్తారని ఇప్పుడు నెలనెలా పెన్షన్ రూపంలో 500 రూపాయలు ఇస్తామనడం సంతోషంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. తమ అవసరాలకు ఆదుకుంటున్నారని ఆయన బాగుండాలని కోరుకుంటున్నారు. పదునైన మాటలు, రాజకీయ విమర్శలతో ఎప్పుడు వార్తల్లో వుండే జగ్గారెడ్డి పేద ప్రజలు, వృద్ధుల పట్ల చూపిస్తున్న ఆదరణ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

Similar News