9వ శ్వేతపత్రం విడుదల

సంపద సృష్టించేందుకు, తలసరి ఆదాయాన్ని పెంచేందుకు పరిశ్రమ, సేవల రంగాలే కీలకం అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Update: 2018-12-31 10:11 GMT
N Chandrababu Naidu

సంపద సృష్టించేందుకు, తలసరి ఆదాయాన్ని పెంచేందుకు పరిశ్రమ, సేవల రంగాలే కీలకం అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పరిశ్రమలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధిపై ఇవాళ శ్వేతపత్రం విడుదల చేశారు. 12 శాతం వృద్ది రావాలని లక్ష్యంగా పెట్టుకుంటే 10.5 వృద్ధి సాధించామని చంద్రబాబు చెప్పారు. అయితే చారిత్రక కారణాల వల్లే ఏపీలో సేవా రంగం, పారిశ్రామిక రంగం వెనుకబడ్డాయని చంద్రబాబు అన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో అభివృద్ధి సాధిస్తే తప్ప అభివృద్ది లక్ష్యానికి త్వరగా చేరుకోలేమని పేర్కొన్నారు. ఆశించిన వృద్ధి సాధిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లవుతుందని, అయితే నైపుణ్యాభివృద్ధిని పెంచగలగాలని చంద్రబాబు చెప్పారు. సర్వీస్ సెక్టార్‌లో పర్యాటక రంగం కీలకమని హెల్త్ టూరిజం, ఎడ్యుకేషన్, టూరిజం గ్రోత్ ఇంజన్లని చంద్రబాబు అన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల్లో ఇది తొమ్మిదవది. 

Similar News