తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదీలీలకి రంగం సిద్దం

Update: 2019-02-13 05:13 GMT

మంత్రి వర్గ విస్తరణ కంటే ముందుగానే రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదీలీలకి రంగం సిద్దం చేస్తోంది సర్కార్. చాల శాఖలకు చెందిన

ముఖ్యకార్యదర్శిలు ,సెక్రటరీలు,పలువురు జిల్లా కలెక్టర్లను ట్రాన్స్ ఫర్స్ చేసేందుకు సద్దమౌతున్నారు. బదీలీలు చేసే అధికారుల లిస్టు సైతం ప్రగతి భవన్ కు చేరినట్లు సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సీఎం కేసీఆర్ ఆమోదం కోసం వేచి చూస్తున్నారు జిఎడి అధికారులు. దీంతో ఏ క్షణమైన రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదీలీలు జరగవచ్చంటూ ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో భారిగానే ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని సెక్రటేరియట్ ఉన్నతాధికారుల మధ్య చర్చ జరుగుతోంది. అటు అధికారుల నుండి ఐఏఎస్ అధికారులు వరకు త్వరలో బదీలీలు ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటి వరకు సీనియర్ అధికారులు ఏఏ శాఖలో ఉన్నారు ఎన్ని సంవత్సరాలనుండి ఒకే చోట పనిచేస్తూన్నారు జిల్లా కలెక్టర్ల పనీతిరు తదితర విషయాలపై వివరాలన్ని ప్రగతి భవన్ కు చేరినట్లు సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి.

మరో వైపు రాష్ట్రంలో ఐఏఎస్‌ల కొరత ఉంది. చాల మంది ఐఏఎస్ అధికారులు ఒకటి కంటే ఎక్కువ శాఖల భాద్యతలు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండాల్సిన ఐఎయస్ ల సంఖ్య 208 మంది అయితే ప్రస్తుతం 154 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో చాలా మంది ట్రైనింగ్ లో ఉన్నారు. ఇక సీనియర్ ఐఏఎస్ లలో కొందరు ఒక్కటి కన్నా ఎక్కువ బాధ్యతలు నిర్వహిస్తు పని ఒత్తిడి కి గురవుతున్నారు. ఇక ఎక్కువ బాధ్యతలు నిర్వహిస్తున్న వారిలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ఉన్నారు. ఈ అధికారికి ఇంధన శాఖ, విద్యా శాఖ ,పర్యావరణ, సైన్స్,టెక్నాలజీ, ఎస్సి డెవలప్మెంట్ శాఖలను చూస్తున్నారు. ఇందులో విద్యాశాఖ ను మరో ఐఏఎస్ కు కేటాయించే అవకాశాలున్నాయి. సునీల్ శర్మ ట్రాన్స్‌పోర్ట్‌, రోడ్లు భవనాలు శాఖ ముఖ్య కార్యదర్శిగా, రవాణా శాఖ కమిషనర్ గాను,ఆర్టీసీ ఎండీ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇందులో రవాణ శాఖ కమిషనర్ గా మరొక ఐఏఎస్‌కు ,ఆర్టీసీ ఎండిగా మరో అధికారికి భాద్యతలు అప్పగించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక రామ కృష్ణారావు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే శాఖలో మరో ఐఏఎస్ శివ శంకర్ రిటైర్ కావడం తో ఆ బాధ్యతలు కూడా రామా కృష్ణారావే చూస్తున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే ఫైనాన్స్ లో ఒక ఐఎయస్ అధికారి అవసరం ఉంటుంది. రామకృష్టరావు ఆర్థిక శాఖ భాద్యతలను అలాగే ఉంచి మరో ఐఏఎస్ అధికారిని ఈయనకు సహకారంగా నియిమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరో ముఖ్యమైన అధికారి రాజేశ్వర్ తివారి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఈయన రెవిన్యూ, స్టాంప్స్ ,రిజిస్ట్రేషన్ ల శాఖ, భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ గా ,డ్రగ్ కంట్రోల్ డీజీ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయనను రెవిన్యూ శాఖ నుంచి మార్చుతున్నారని సెక్రటేరియట్ అధికార వర్గాల్లో చర్చ జరుతోంది.

సాదారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శిగా అధర్ సిన్హా కూడా సర్వీసెస్ సెక్రటరీ బాధ్యతలను అదనంగా చూస్తున్నారు. సందీప్ కుమార్ సుల్తానియా సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉంటూనే పశు సంవర్ధక శాఖ బాధ్యతలు చూస్తున్నారు.ఈయనను పశు సంవర్థశాఖ బాద్యతల నుంచి తప్పిస్తరో లేదో చూడాలి. బుర్రా వెంకటేశం , సోమేశ్ కుమార్ కమర్షియల్ టాక్స్ కమిషనర్ గా ఉన్నా అనిల్ కుమార్‌, దాన కిషోర్‌‌లను ప్రస్తుతం మార్చే అవకాశాలు ఉండకపోవచ్చనే తెలుస్తోంది.

మరో నలుగురు ఐఏఎస్ లు కూడా పోస్టింగ్ ల కోసం ఎదురు చూస్తున్నరు. ఈమద్యనే సూర్యపేట జిల్లా కలెక్టర్ గా బదిలీ అయినా సురేంద్ర మోహన్, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ బదిలీ అయినా గౌతమ్, హెచ్ఎండిఏ కమిషనర్ గా బదిలీ అయినా జనార్థన్ రెడ్డి, మరో ఐఏఎస్ వెంకటేశ్వర్ రావు ల కు ప్రభుత్వ పోస్టింగ్ లు ఇవ్వలేదు. దీంతో ఐఏఎస్ బదిలీల్లో తమకు పోస్టింగ్ వస్తుందని ఎదరు చూస్తున్నారు.

Full View

Similar News