Depression Problem: బాడీలో ఈ పోషకాలు లోపిస్తే డిప్రెషన్‌లోకి వెళ్తారు.. అవేంటంటే..?

Depression Problem: మనిషి ఆరోగ్యంగా ఉండడానికి అన్ని రకాల పోషకాలు అవసరమవుతాయి. ఏ ఒక్కటి లోపించినా అనారోగ్యానికి గురికావాల్సి ఉంటుంది.

Update: 2024-05-06 01:30 GMT

Depression Problem: బాడీలో ఈ పోషకాలు లోపిస్తే డిప్రెషన్‌లోకి వెళ్తారు.. అవేంటంటే..?

Depression Problem: మనిషి ఆరోగ్యంగా ఉండడానికి అన్ని రకాల పోషకాలు అవసరమవుతా యి. ఏ ఒక్కటి లోపించినా అనారోగ్యానికి గురికావాల్సి ఉంటుంది. శరీరంలో కొన్ని రకాల విటమిన్లు, పోషకాలు లోపించినప్పుడు తెలియకుండానే వారు డిప్రెషన్‌లోకి వెళ్తారు. దీనివల్ల వారు నెమ్మదిగా అనేక వ్యాధుల బారినపడుతారు. అందుకే డిప్రెషన్‌తో ముడిపడి ఉన్న కొన్ని పోషకాహారాల గురించి తెలుసుకోవడం అవసరం. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

విటమిన్ డి లోపం

మానసిక స్థితి నియంత్రణలో విటమిన్‌ డి కీలక పాత్ర పోషిస్తుంది. ఆనందంతో సంబంధం ఉన్న ముఖ్యమైన న్యూరోట్రాన్స్మిటర్ అయిన సెరోటోనిన్ ఉత్పత్తిలో సాయపడుతుంది. చాలా మంది చలికాలంలో తేలికపాటి డిప్రెషన్‌ను అనుభవిస్తారు. ఈ సీజన్‌లో విటమిన్ డి స్థాయిలు తక్కువ గా ఉండటం దీనికి కారణం. విటమిన్ డి సప్లిమెంట్ డిప్రెషన్ లక్షణాలను మెరుగుపరుస్తుందని అనేక పరిశోధనలలో తేలింది. విటమిన్‌ డి కోసం సాల్మన్, సార్డినెస్ వంటి కొవ్వు చేపలు, పాలు, గుడ్లు, పుట్టగొడుగులు ఎక్కువగా తీసుకోవాలి.

విటమిన్ బి లోపం

సెరోటోనిన్, డోపమైన్ ఉత్పత్తిని B విటమిన్లు (B6, B9, B12) ప్రభావితం చేస్తాయి. ఇవి మూడ్ నియంత్రణకు అవసరమవుతాయి.

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల లోపం

మెదడు ఆరోగ్యం EPA, DHA వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలపై ఆధారపడి ఉంటుంది. ఇవి వాపును తగ్గించడంలో సాయపడుతాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మానసిక రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటుంది.

ఐరన్ లోపం

ఆక్సిజన్ కోసం శరీరానికి ఐరన్‌ అవసరం. ఐరన్ లోపం వల్ల అలసట, చిరాకు వస్తుంది. ఇది మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది.

విటమిన్ సి లోపం

విటమిన్ సి లోపం వల్ల అలసట, చిరాకు ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది మెదడు రసాయనాల ను నిర్మించడానికి, శరీరం ప్రతిస్పందనను నియంత్రించడానికి అవసరమవుతుంది.

జింక్ లోపం

జింక్ న్యూరోట్రాన్స్మిటర్ స్థాయిలు, నాడీ వ్యవస్థ కార్యకలాపాలను నియంత్రిస్తుంది. తక్కువ జింక్ స్థాయిలు డిప్రెషన్‌కు దారితీస్తాయి. ఎవరికైనా డిప్రెషన్ ఉండవచ్చు. కాబట్టి లక్షణాల గురించి వైద్యుడితో మాట్లాడటం ముఖ్యం.

Tags:    

Similar News