దక్షిణ కాలిఫోర్నియాలో భారీ భూకంపం

Update: 2019-07-06 05:32 GMT

దక్షిణ కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. గత 25 ఏళ్లలో ఇదే అతి పెద్ద భూకంపంగా గుర్తించారు. రెండు రోజుల క్రితం ఇక్కడ 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. రెండు రోజుల క్రితం ఇక్కడ 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 19 నిమిషాలకు భూకంపం సంభవించింది. లాస్ఏంజిల్స్, మెక్సికోలో కూడా భూమి కంపించినట్టు చెబుతున్నారు. లాస్ఏంజిల్స్‌కు ఉత్తరాన 202 కిలోమీటర్ల దూరంలోని ఎడారి పట్టణం రిడ్జ్‌ క్రెస్ట్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం సమయంలో షాపింగ్ మాల్స్‌లోని వస్తువులు కిందపడిపోయాయి. గోడాలు బీటలు వారాయి. పలువురు స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తోంది. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News