ఈవీఎం లపై ఎలాంటి అపోహలు అవసరం లేదు: ద్వివేది

Update: 2019-03-31 04:20 GMT

ఈవీఎం లపై ఓటర్లకు ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది. ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్‌లో తాము ఎవరికి ఓటు వేసిందీ సరిచూసుకోవచ్చన్నారు. రెండు, మూడు రోజుల్లో ఎన్నికల పరిశీలకులు రాష్ర్టానికి రానున్నట్లు చెప్పారు. ఈ నెల 25న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాను అన్ని రాజకీయ పార్టీలకూ అందజేస్తామన్నారు. వాటితోపాటు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన 200 మంది ఎన్నికల పరిశీలకుల వివరాలు, ఫోన్‌ నెంబర్లు కూడా ఇస్తామన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల 93లక్షల 45 వేల 717 ఓటర్లు ఉన్నారని చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అసెంబ్లీకి 2,395 మంది అభ్యర్థులు, పార్లమెంటుకు 344 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. 

Similar News