ఆ బంగారం.. ఏడుకొండలవాడిదే..

Update: 2019-04-18 05:03 GMT

తమిళనాడు తిరువళ్లూరులో పట్టుబడిన బంగారం టీటీడీదేనని పంజాబ్ నేషనల్‌ బ్యాంక్ స్పష్టం చేసింది. తిరుమల శ్రీవారికి చెందిన 8500 కేజీల బంగారాన్ని టీటీడీ ఆంధ్రా, పంజాబ్‌ నేషనల్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. అయితే, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో డిపాజిట్ చేసిన 1318 కేజీల బంగారం మెచ్యూరిటీ 20 రోజుల క్రితం ముగిసింది. దీంతో బంగారాన్ని ట్రెజరీకి చేర్చాలని టీటీడీ పంజాబ్ నేషనల్‌ బ్యాంకును ఆదేశించింది. 1318 కేజీల బంగారాన్ని టీటీడీ ట్రెజరీకి తరలిస్తుండగా తమిళనాడు తిరువళ్లూరు జిల్లా వేపంపట్టులో ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీల్లో పట్టుబడింది.

ఎలక్షన్‌ స్క్వాడ్‌ సీజ్‌ చేసిన బంగారం టీటీడీదేనని చెబుతున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ గోల్డ్ డిపాజిట్‌కు సంబంధించిన ఆధారాలను చూపిస్తోంది. బంగారాన్ని ట్రెజరీకి తరలించాలంటూ టీటీడీ రాసిన లేఖతో పంజాబ్ నేషనల్‌ బ్యాంక్ మేనేజర్‌ తిరువళ్లూరు బయలుదేరారు. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన టీటీడీ బంగారం తిరుమలలో అప్పగించాల్సిన బాధ్యత పీఎన్‌బీదేనని స్పష్టం చేసింది.

Similar News