అక్రమ తవ్వకాలపై కఠినంగా వ్యవహరించండి

Update: 2019-04-26 12:20 GMT

ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై కఠినంగా వ్యవహరించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ సీఎస్‌ను ఆదేశించింది. అక్రమ తవ్వకాలకు పాల్పడినవారిపై భారీ జరిమానాలు విధించాలని సీఎస్ ఎల్‌వీ సుబ్రహ్మణ్యంను ఎన్‌‌జీటీ ఆదేశించింది. వాటిని చూసి మరెవరు అక్రమ తవ్వకాలను పాల్పడకుండా నిరోధించాలని ఎన్జీటీ ధర్మాసనం ఏపీ సీఎస్‌ను ఆదేశించింది. మరో 6 నెలల్లోమరోసారి సమావేశమౌదామని తెలిపిన ఎన్‌జీటీ ఈలోగా స్టేటస్ రిపోర్ట్ అందించాలని ఆదేశించింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉందని, కాలుష్య నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచన చేసింది.

Full View


Similar News