పీఎస్ఎల్వీ సీ 46 ప్రయోగానికి సర్వం సిద్ధం...రేపు ఉదయం 5:30 గంటలకు రాకెట్ ప్రయోగం

Update: 2019-05-21 16:15 GMT

భారత అంతరిక్ష పరిశధన సంస్థ ఇస్రో మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి మరికొన్ని గంటల్లో పీఎస్ఎల్‌వీ సీ 46 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

శ్రీహరికోటలో పీఎస్‌ఎల్వీ సీ- 46 రాకెట్‌ ప్రయోగానికి అంతా సిద్ధమైంది. రేపు ఉదయం షార్‌ కేంద్రంలో మొదటి ప్రయోగ వేదిక నుంచి 5.30 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ46 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. పీఎస్ఎల్వీ సీ 46 615 కిలోల రీశాట్2, బీఆర్1 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది వీటి కాల పరిమితి ఐదేళ్లు ఉండనున్నాయి.

రీశాట్2 ఉపగ్రహం సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలు, వారి కదలికలపై నిశిత పరిశీలనకు ఉపయోగ పడుతుంది. ఇక ప్రకృతి వైపరీత్యాల సమయంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కు మరింత ఉపయోగ పడుతుంది పీఎస్ఎల్పీ మొదటి నాలుగు దశలూ పూర్తి చేసుకొని 15.29 నిమిషాలకు రిశాట్ 2 ఉపగ్రహాన్ని భూమికి 557 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో ప్రవేశ పెట్టనుంది. ఇందుకు గాను కౌంట్‌డౌన్ ప్రక్రియ ఇవాళ ఉదయం 4.30 గంటలకు ప్రక్రియ ప్రారంభమైంది.

పీఎస్ఎల్‌వీ సీ 46 ను తొలుత ఉదయం 5.27గంటలకు ప్రయోగించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అయితే అంతరిక్షంలో పలు శకలాలు అడ్డుపడే అవకాశముండటంతో ప్రయోగాన్ని మూడు నిమిషాలు పెంచారు. పీఎస్ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 48వది కాగా ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి 36వ రాకెట్. ఇప్పటి వరకు షార్ నుంచి 71 రాకెట్ ప్రయోగాలు జరగగా ఈ ఏడాది ఇది మూడోది కావడం విశేషం.

Similar News