సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్‌ వేటు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణను ఆ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేసింది.

Update: 2019-01-06 09:47 GMT

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణను ఆ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేసింది. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ క్రమశిక్షణ కమిటీ సస్పెండ్ చేసింది. మల్కాజ్ గిరి నియోజకవర్గ సమావేశంలో పార్టీ నేతలు కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ పై సర్వే దాడికి పాల్పడ్డారు. సర్వే తీరును సీరియస్ గా తీసుకున్న అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇటివల జరిగిన ఎన్నికల్లో సర్వే కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీలో దిగి ఓడిపోయారు. అయితే సర్వ సత్యనారాయణ సస్పెన్షన్ పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News