వివాదాస్పదమైన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమా

మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ జీవితంపై 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' పేరుతో తెరకెక్కిన సినిమా వివాదాస్పదమైంది.

Update: 2018-12-28 08:10 GMT
The Accidental Prime Minister

మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ జీవితంపై 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' పేరుతో తెరకెక్కిన సినిమా వివాదాస్పదమైంది.అనుపమ్ ఖేర్ మన్మోహన్ పాత్రలో నటించిన ఈ సినిమాను జనవరి 11న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే, ఈ సినిమాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను నెగటివ్ షేడ్స్‌లో చూపించారంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న అణు ఒప్పందం, ఓ దశలో మన్మోహన్ రాజీనామాకు సిద్ధపడటం సహా పలు అంశాలను ఈ సినిమాలో చూపించారు. అయితే ఈ సినిమాలో వాస్తవాలను వక్రీకరించేలా సన్నివేశాలు ఉన్నాయని మహారాష్ట్ర్ర యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు లేవని ధ్రువీకరించేందుకు ఈ సినిమా ప్రదర్శనను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ కార్యవర్గ సభ్యులకు సినిమాను ముందుగా ప్రదర్శించి అవసరమైన మార్పులు చేయకుంటే దేశమంతటా 'యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' చిత్రాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.

Similar News