ఎన్నికల హామీలపై దృష్టిసారించిన సీఎం కేసీఆర్‌

ఎన్నికల హామీలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. వ్యవసాయదారులకు ఇచ్చిన హామీలపై ప్రధానంగా దృష్టి సారించిన ఆయన ఫుడ్ ప్రాసెసింగ్‌ పరిశ్రమపై సీఎం కేసీఆర్ సమీక్షించారు.

Update: 2018-12-31 08:05 GMT
cm kcr

ఎన్నికల హామీలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. వ్యవసాయదారులకు ఇచ్చిన హామీలపై ప్రధానంగా దృష్టి సారించిన ఆయన ఫుడ్ ప్రాసెసింగ్‌ పరిశ్రమపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి వ్యవసాయ, పరిశ్రమ, ఉద్యాన శాఖలతో పాటు వివిధ వ్యవసాయ యూనివర్సిటీల అధికారులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తియ్యి సాగు భూమి పెరుగుతున్నందున వివిధ పంటల దిగుబడి పెరిగే అవకాశముందని వ్యవసాయ అధికారులు వివరించారు. దిగుబడి పెరిగిన సమయంలో రైతులకు వీలైనంత ప్రయోజనం చేకూరేలా జిల్లాకో ఫుడ్ ప్రాసెసింగ్‌ పరిశ్రమ నెలకొల్పేలా చూడాలంటూ కేసీఆర్ సూచించారు . ఫుడ్ ప్రాసెసింగ్‌ రంగంపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలంటూ ఆదేశించారు. 

Similar News