టీడీపీ, జనసేన బంధం మళ్ళీ బలపడుతోందా..?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన బంధం మళ్ళీ బలపడుతోందా..? పాత మిత్రుల మధ్య మరోసారి స్నేహం చిగురిస్తోందా..? వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తాయా..? టీడీపీ, జనసేన కలసి పోటీ చేయాలన్న ఆకాంక్ష చంద్రబాబుదా..? పవన్ కల్యాణ్‌దా..?

Update: 2019-01-02 03:53 GMT
Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన బంధం మళ్ళీ బలపడుతోందా..? పాత మిత్రుల మధ్య మరోసారి స్నేహం చిగురిస్తోందా..? వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తాయా..? టీడీపీ, జనసేన కలసి పోటీ చేయాలన్న ఆకాంక్ష చంద్రబాబుదా..? పవన్ కల్యాణ్‌దా..?

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదో శ్వేతపత్రం విడుదల సందర్భంగా పవన్ పట్ల టీడీపీ అధినేత సానుకూల ధోరణితో మాట్లాడారు. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయంటూ జగన్ ఇటీవల చెప్పడాన్ని మీడియా ప్రతినిథులు గుర్తు చేయగా తాను పవన్‌ కల్యాణ్‌ కలిస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.

ఈ మధ్య టీడీపీ, జనసేన విమర్శించుకోకపోవడాన్ని ఓ విలేకరి చంద్రబాబు దగ్గర ప్రస్తావించగా మోడీ, కేసీఆర్, జగన్ లక్ష్యాలు, ఉద్దేశాలు ఒకటేనని అందుకే పవన్‌ని వారితో పోల్చడం లేదని చెప్పారు. అయితే బీజేపీపై పోరాటానికి గతంలోనూ తాను పవన్ కల్యాణ‌్‌ని కోరినట్లు గుర్తు చేశారు.

నిజానికి ఏపీ సీఎం ఇటీవల పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు తగ్గించారు. గతంలో మాదిరిగా విమర్శలు చేయడం లేదు. చంద్రబాబు మూడు రోజుల క్రితం మోడీ, కేసీఆర్‌, జగన్‌ను ఒకే గాటన కట్టేశారు. మోడీ మిడిల్ మోడీ జూనియర్ మోడీ అని కేసీఆర్‌, జగన్‌ని ఎద్దేవా చేసిన చంద్రబాబు పవన్‌ని మాత్రం వదిలేశారు. చంద్రబాబు తాజా వ్యాఖ్యలతో టీడీపీ జనసేన మధ్య పొత్తు పొడవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు కూడా రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేసే అంశాన్ని మీడియా దగ్గర దాటవేయడం విశేషం.

Full View 

Similar News