ఈరోజు (మే-18-సోమవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-05-18 00:55 GMT
Andhra Pradesh and Telangana updates from HMTVlive

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.




Live Updates
2020-05-18 16:49 GMT

తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఅర్ ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్‌ భేటీ అనంతరం ప్రగతి భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాతో కలిసి జీవించాల్సిందే అన్నారు. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెస్తామన్నారు. 

-మరిన్ని వివరాలు

2020-05-18 15:51 GMT

దుర్మార్గమైన ఆర్థిక ప్యాకేజీ ఇది అంటూ కేంద్రం పై విరుచుకుపడ్డ కేసీఆర్‌ 

కేంద్రం మోసం చేస్తోంది 

కేంద్రం దీనికి తగ్గ మూల్యం భవిష్యత్తులో చెల్లించుకుంటుంది

ఎవరికీ ఉపయోగంలేని బోగస్ ప్యాకేజీ ఇది

ఈ ప్యాకేజీ తీరు బాధాకరం

రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం సరికాదు

మెడమీద కత్తిపెట్టి రాష్ట్రాల పై పెత్తనామా?

కేంద్రం దగా

కేంద్ర సాయం మాకొద్దు

-మరిన్ని వివరాలు 

2020-05-18 15:32 GMT

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఉదయం ఆరు నుంచి ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయని ఆయన తెలిపారు. అయితే హైదరాబాద్‌లో సిటీ బస్సు సర్వీసులు నడవవు అని సీఎం స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో ఆటోలు, టాక్సీలకు అనుమతి. ఆటోలో డ్రైవర్‌ +2, టాక్సీలో డ్రైవర్‌ +3 నియమం పాటించాలి. రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు తెరుచుకోవచ్చు.

ఈ-కామర్స్‌ ను అనుమతి ఇస్తున్నాం. ఆర్టీసీ బస్సులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నడిపిస్తాం. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు జాగ్రత్తలతో, వంద శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. పరిశ్రమలు కూడా వంద శాతం సిబ్బందితో నిర్వహించుకోవచ్చు. కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుంది’’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 



2020-05-18 15:22 GMT

- సెలూన్లలో హెయిర్ కటింగ్ కు మాత్రమే అనుమతి.. షేవింగ్..ఫేషియల్ వంటివి నిషిద్ధం.

- ప్రభుత్వ..ప్రైవేట్ కార్యాలయాలు నూరుశాతం స్టాఫ్ తో పనిచేయొచ్చు. హైదరాబాద్ లో ఈ అనుమతి లేదు.

- పార్కులూ..జిమ్ములూ బంద్

- లాక్ డౌన్ మే 31 వరకూ

- రేపు ఉదయం నుంచే ఆర్టీసీ 

- కోవిడ్ నిబంధనలు పాటించాలి

- పెళ్లిళ్లు..ఫంక్షన్లకు పరిమిత అనుమతి

- హైదరాబాద్ తప్పితే మిగతా అంతా గ్రీన్ జొనే అంటున్న సీఎం కేసీఆర్‌ 

-మరిన్ని వివరాలు 

2020-05-18 15:20 GMT

- సెలూన్లకు ఆనుమతి

- సినిమా హాల్స్..మాల్స్ తెరుచుకోవు

- బార్లు..రెస్టారెంట్లు ఉండవు

- హైదరాబాద్ లో షాపులకి సరి..బేసి విధానం

- మెట్రోరైళ్లు బంద్

- ప్రార్టనా మందిరాలు..సమావేశాలకు నో

- కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు కొనసాగుతాయి

- కంటైనమెంట్ జోన్లు మినహా అన్ని జోన్లలోనూ దుకాణాలన్నీ తెరవ వచ్చు

- ఈకామర్స్ సంస్థలకు అనుమతి 

2020-05-18 14:47 GMT

లాక్ డౌన్ 4.0 నిబంధనలు తెలంగాణాలో ఎలా వుంటాయో సీఎం కేసీఆర్ ప్రకటించారు..

- హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో నిబంధనల సడలింపు.

- మ్యాన్యుఫ్యాక్చరింగ్ యునిట్లు తెరుచుకోవచ్చు

- కొనసాగనున్న రాత్రి కర్ఫ్యూ

- జిల్లాలకు బస్సులు తిరుగుతాయి

- ఇతర రాష్ట్రాలకు బస్సులు తిరగావు

- హైదరాబాద్ లో సిటీబస్సులు తిరగవు

- పరిశ్రమలన్నిటికీ అనుమతి



2020-05-18 13:53 GMT

ఆత్మకూరు పట్టణంలోని ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ కు భద్రతకు కావలి నుండి వచ్చిన ఎస్కార్ట్ పోలీస్ సిబ్బంది తమకు కేటాయించిన గదిని ప్రభుత్వ జూనియర్ కళాశాల వాచ్ మెన్ కుమార్తె ఏడేళ్ల చిన్నారి బాలిక చే తడి గుడ్డతో రూమ్ అంతా క్లీన్ చేయించిన ఎస్కార్ట్ సిబ్బంది... 



2020-05-18 13:48 GMT

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తోపుదుర్తి మహిళా సహకార డైరీ, నియోజకవర్గ పారిశ్రామిక వేత్తలు, నాయకులు రూ. 1,00,00,000/- విరాళం.

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైయస్‌ జగన్‌ గారికి అందజేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వేదవ్యాస్, రాజశేఖర్ రెడ్డి , హరిప్రసాద్ చౌదరి.



2020-05-18 13:22 GMT

- అక్రమ కట్టడాలపై విచారణాధికారి చంద్రశేఖర్ ఆజాద్ ఉక్కుపాదం

- దేవస్థానం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 10 బిల్డింగులు అక్రమ కట్టడాలు కూల్చివేసిన చంద్రశేఖర్ ఆజాద్.

- దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు సింహాచల దేవస్థానం అక్రమ కట్టడాలపై పై విచారణ అధికారిగా చంద్రశేఖర్ ఆజాద్.

2020-05-18 12:48 GMT

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం లాక్ డౌన్ కాలపరిమితిని మే నెల 31వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో భక్తులకు దర్శనము లను నిలుపుదల చేయొచ్చు గతంలో ఇచ్చిన ఆదేశాలను కొనసాగించినట్లు దేవదాయ శాఖకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

అన్ని దేవాలయాల్లో యధావిధిగా నిత్య పూజలు. సాంప్రదాయం ప్రకారం కొనసాగుతాయన్నారు. అదే విధంగా ఆర్జిత సేవలు కోసం ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరిపి పరోక్షంగా సేవలు అందించే విధంగా అన్ని దేవాలయాల్లో ఏర్పాటు చేసుకోవాలని కార్యనిర్వాహక అధికారులను మంత్రి ఆదేశించారు.



 


Tags:    

Similar News