రేపటి నుంచే తెలంగాణ ఆర్టీసీ సర్వీసులు..

రేపటి నుంచే తెలంగాణ ఆర్టీసీ సర్వీసులు..
x
KCR (File Photo)
Highlights

తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఅర్ ప్రకటించారు.

తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఅర్ ప్రకటించారు. ఈ మేరకు కేబినెట్‌ భేటీ అనంతరం ప్రగతి భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాతో కలిసి జీవించాల్సిందే అన్నారు.

* హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలో అన్ని చోట్లా అన్ని షాపులకు అనుమతి

* హైదరాబాద్‌లో మాత్రం సరి-భేసి విధానం అమలు

* రాష్ట్రంలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల సర్వీసులు

* సిటీ బస్సులు, అంతర్రాష్ట్ర బస్సులు మాత్రం అనుమతి లేదు

* ఆటోలు, ట్యాక్సీలు పరిమిత సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవాలి

* కంటైన్‌మెంట్‌ మినహా అన్ని చోట్లా సెలూన్లు తెరుచుకోవచ్చు.

* ఈ-కామర్స్‌కు నూరు శాతం అనుమతి

* ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజూ శానిటైజ్‌ . మాస్కు తప్పనిసరిగా ధరించాలి.

*ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ పనిచేసుకోవచ్చు.

* పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, మానుఫాక్చరింగ్‌ యూనిట్లు పనిచేసుకోవచ్చు.

*మే 31 వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుంది

1452 కుటుంబాలు మాత్రమే కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఉంటాయని తెలిపారు. ఆ ప్రాంతాలు తప్ప మిగిలినవన్నీ గ్రీన్‌ జోన్లే. రాష్ట్రంలో ఆటోలు, టాక్సీలకు అనుమతి ఇస్తున్నాం. ఆటోలో డ్రైవర్‌ +2, టాక్సీలో డ్రైవర్‌ +3 నియమం పాటించాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories