రేపు ఉదయం ఆరు నుంచి ఆర్టీసీ సర్వీసులు

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఉదయం ఆరు నుంచి ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయని ఆయన తెలిపారు. అయితే హైదరాబాద్‌లో సిటీ బస్సు సర్వీసులు నడవవు అని సీఎం స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రంలో ఆటోలు, టాక్సీలకు అనుమతి. ఆటోలో డ్రైవర్‌ +2, టాక్సీలో డ్రైవర్‌ +3 నియమం పాటించాలి. రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు తెరుచుకోవచ్చు.

ఈ-కామర్స్‌ ను అనుమతి ఇస్తున్నాం. ఆర్టీసీ బస్సులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నడిపిస్తాం. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు జాగ్రత్తలతో, వంద శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. పరిశ్రమలు కూడా వంద శాతం సిబ్బందితో నిర్వహించుకోవచ్చు. కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుంది’’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 



Update: 2020-05-18 15:32 GMT

Linked news