ఆయనకు పదవీ వ్యామోహం పోలేదు.. ఇంకా భ్రమలోనే..

Update: 2019-04-19 12:24 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసినా కానీ ఆయా పార్టీ నేతల్లో మాత్రం వివాదం రోజురోజుకి ముదురుతూనే ఉంటోంది. నారా చంద్రబాబుకు పదవీ వ్యామోహం పోలేదు. చంద్రబాబు ఇంకా అధికార భ్రమలోనే ఉన్నారని బోత్స ఎద్దేవా చేశారు. వ్యవస్థలన్నీ తన చెప్పు చేతల్లో ఉండాలని అనుకుంటున్నారని అన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై బోత్స విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత చంద్రబాబు 18 జీవోలు జారీ చేశారని మండిపడ్డారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కోడ్‌ అమల్లో ఉంటే చంద్రబాబు సమీక్షలు ఎలా నిర్వహిస్తారని తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఇక మరి కొన్ని రోజుల్లోనే ప్రజా ప్రభుత్వం రాబోతోందని టీడీపీ శకం అంతమైందని బోత్స అన్నారు. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని బాబు కోల్పోయారని ఏ విషయంలో చూసినా మోసం, దగానే. టీడీపీని జనం పరుగెత్తించే రోజు దగ్గర్లోనే ఉందని ఆరోపించారు.

సీఎం కుర్చీకోసం చంద్రబాబు తాపత్రయం పడుతున్నారని విమర్శించారు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. ఓటమి తర్వాత కూడా సీఎం కుర్చీ కావాలంటే చాలా ప్రమాదమని, అలాంటి మానసిక పరిస్థితి చంద్రబాబుకి రాకూడదన్నారు. చంద్రబాబు వేసవి కాలంలో నీటికొరతపై సమీక్ష చేయకుండా అవినీతి సొమ్ము కోసం సమీక్షలు చేస్తున్నారని బొత్స విమర్శించారు. దగా, కుట్రల్లాంటి ఆలోచనలు ఇంకా చంద్రబాబులో పోలేదని, వ్యవస్థలన్నింటినీ ఆయన భ్రష్టుపట్టించారని మండిపడ్డారు.

Similar News