తొలి కేబినెట్‌లోనే కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్ సర్కార్

Update: 2019-06-10 07:51 GMT

ఏపీలో కొలువుదీరిన కొత్త కేబినెట్‌ ఇవాళ ఫస్ట్ టైమ్ సమావేశమైంది. రైతులు, మహిళలు, ఉద్యోగులే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. సెక్రటేరియట్‌ ఫస్ట్‌ బ్లాక్‌‌ - సమావేశ మందిరంలో కేబినెట్‌ మీటింగ్ జరగుతుంది. ఈ సమావేశంలో జగన్ సర్కార్ పలు కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకుంది. సామాజిక భద్రత పెన్షన్ ను 2వేల నుంచి 2వేల 250కి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా మంత్రివర్గం ఆమోదించింది. అలాగే ఆశా వర్కర్ల జీతం రూ. రూ.3000 నుంచి 10,000కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ సుముఖత వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఇంకా భేటీ కొనసాగుతోంది. 

Tags:    

Similar News