ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి భేటీకి ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడతారు.

Update: 2019-01-12 01:13 GMT
Assembly

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడతారు.

ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతాయి. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కోసం ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడడడంతో పాటు త్వరలో ఎంఎల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉండటంతో ముందుగానే అసెంబ్లీని సమావేశపరుస్తున్నారు. అలాగే ఇవే చిట్టచివరి సమావేశాలు కావడంతో ప్రారంభం రోజున గవర్నర్‌ నరసింహన్‌ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించే అవకాశముంది.

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌లో అసెంబ్లీ తొలి సమావేశాలు జరిగాయి. రెండున్నర సంవత్సరాలు పాటు అక్కడే సమావేశాలు నిర్వహించాక వెలగపూడి కేంద్రంగా తాత్కాలిక అసెంబ్లీ భవనంలో సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీకి ఇవి 15వ సమావేశాలు. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో తక్కువ రోజులు సభ జరపాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 5న రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు భారీగా ఖర్చు చూపించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సర ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ 2లక్షల కోట్ల రూపాయలు దాటువచ్చని సమాచారం. గతేడాది బడ్జెట్‌ లక్షా 93 వేల 000 కోట్లుగా ఉంది. ఈసారి బడ్జెట్‌పై ఒక్క రోజు మాత్రమే చర్చ జరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి ప్రశ్నలు తీసుకోవాలని ప్రభుత్వం అసెంబ్లీ అధికారులను ఆదేశించింది.


Similar News