సినిమా నటుల పైన మరియు క్రికెటర్స్ పైన రూమర్లు అనేవి కామన్ ..ఎంతాలంటే అసలు అ విషయం పైన వాళ్ళు తిరిగి స్పందించే వరకు అ న్యూస్ తెగ వైరల్ అవుతూనే ఉంటుంది . తాజాగా ఇలాంటిదే జరిగింది.. టాలీవుడ్ బ్యూటీ అనుమప పరమేశ్వరన్.. యువ క్రికెటర్ మరియు ఇండియన్ బౌలర్ బుమ్రా మధ్య రొమాన్స్ జరుగుతుందని వార్తలు సోషల్ మీడియాలోనే కాదు.. జాతీయ మీడియాలో కూడా ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకర్నొకరు ఫాలో అవుతున్నారు. బుమ్రా ఫాలో అవుతున్న ఏకైక సినిమా నటి అనుపమేనా కావడం విశేషం . దీంతో నెటిజన్లు వీరి గురించి చర్చను షురూ చేశారు. జాతీయ మీడియా సైతం వీరి వ్యవహారంపై ఓ లుకేయ్యడంతో వ్యవహారం చాలా దూరం వెళ్ళింది . అయితే దీనిపైన అనుపమ స్పందిచింది ..
బుమ్రా తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని తమ మధ్య ఎలాంటి రేలషన్షిప్ లేదని పేర్కొంది. ఇలాంటి వార్తలు పుట్టించడం వల్ల ఏమొస్తుందో నాకైతే అర్థం కావడం లేదని ఘాటు రియాక్షన్ ఇచ్చింది అనుపమ. గతంలో కూడా రాశిఖన్నా బుమ్రాతో డేటింగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ తరవాత రూమర్లు అని తేలిపోయాయి .