గవర్నర్‌తో అఖిలపక్ష నాయకుల భేటీ...మంత్రి జగదీశ్వర్‌ రెడ్డిని...

Update: 2019-04-25 11:35 GMT

ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై అఖిలపక్ష నేతలు గవర్నర్‌‌‌ను కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నర్సింహన్‌తో సమావేశమైన ఉత్తమ్‌, భట్టి, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, కోదండరాం, ఎల్‌.రమణలు ఇంటర్‌ రిజల్ట్స్‌ వివాదంపై ఫిర్యాదు చేశారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతో విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్ధులకు న్యాయం చేయడంతో పాటు అవకతవకలకు కారణమైన అధికారులపై చర్యలకు ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని అన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డిని కేబినేట్‌ నుంచి భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Similar News