ప్రభాస్ పిటిషన్‌పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

హీరో ప్రభాస్‌ ల్యాండ్‌ కేసులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. అయితే కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Update: 2019-01-03 10:40 GMT
prabhas

హీరో ప్రభాస్‌ ల్యాండ్‌ కేసులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. అయితే కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రీల్‌ లైఫ్‌లో విలన్లను ఎదుర్కొన్న బాహుబలి రియల్‌ లైఫ్‌లో విలన్లతో తలపడి ఉండడని వ్యాఖ్యానించింది. సామాన్యుడి విషయంలో అయితే అప్పుడే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవాళ్లం, కానీ ప్రభాస్‌‌ విషయంలో ఆచితూచి వ్యవహరించామని తెలిపింది. అయితే ప్రభాస్‌‌ భూకబ్జాదారుడన్న ప్రభుత్వ లాయర్ వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పిన హైకోర్టు భూకబ్జాదారుడైనా సరే సెక్షన్ 17 కింద నోటీసులు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. ప్రభాస్‌‌కు అనుకూలంగా తీర్పు ఇస్తే మిగతా కబ్జాదారులు కూడా అర్హులవుతారని ప్రభుత్వ లాయర్‌ అన్నారు. అయితే కొనుగోలు చేసిన భూమిలోనే గెస్ట్‌ హౌస్‌ కట్టుకున్నాడని ప్రభాస్ లాయర్ విన్నవించారు. దాంతో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది.

Similar News