అలీపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్

Update: 2019-04-08 11:04 GMT

 సినీ నటుడు, వైసీపీ నేత అలీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అలీని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. కష్టాల్లో అలీకి అండగా తాను ఉన్నానని, స్నేహమంటే ఇదేనా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అయితే అలీని వైసీపీ నేతలు వాడుకుంటున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. నటుడు అలీ సూచించిన వ్యక్తికే నరసారావుపేట ఎంపీ టికెట్ ఇచ్చానని కానీ ఆయన మాత్రం వైసీపీకి ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయితే నా మిత్రుడు అలీకి సమాజం మీద వేదన ఉంటుందని అన్నారు. అందుకే తాను ఎవరినీ నమ్మడం లేదని.. ప్రజలను మాత్రమే నమ్ముకున్నానని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ సెంటర్‌లో పవన్ రోడ్‌ షో నిర్వహించారు పవన్. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.

తన తండ్రి శవం దొరక్కముందే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకున్న జగన్ మోహన్ రెడ్డి ఏపీ రాష్ట్రానికి అవసరమా అని మరోసారి పవన్ ప్రశ్నించారు. వైఎస్‌ బావమరిది రవీంద్రారెడ్డి సినిమా తీయాలని బెదిరించారని, జగన్ ఇంట్లో వాటా ఇమ్మంటే ఇస్తారా? బెదిరిస్తే తోలు తీస్తానని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ హెచ్చరించారు. కాగా అలీ వైసీపీ పార్టీలో చేరడంపై గతంలో కూడా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని మీడియాకు తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బలమైన నాయకుడని అలీ భావించి వైసీపీ గూటికి చేరి ఉంటాడని పవన్ వ్యాఖ్యానించారు. అలీ వేరే పార్టీలో చేరినంత మాత్రాన తనకేం నష్టం జరగదని పవన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే సినీమా పరంగా ఒకటి రెండు తప్పా పవన్ నటించిన అన్ని సినామాల్లోనూ అలీ ఉన్నారు. సినిమాల్లోనే కాదు బయట కూడా వీళ్లు చాలా క్లోజ్‌గా ఉంటారు. అయితే ఇప్పుడు అలీపై విమర్శలు గుప్పించడం హాట్‌టాపిక్‌గా మారింది.

Similar News