Trump-Zelensky: వైట్హౌస్లోనే ట్రంప్‌‌తో జెలెన్​స్కీ యుద్ధం.. ఆందోళనకు గురైన ఉక్రెయిన్ రాయబారి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య సమావేశం ఊహించని మలుపు తిరిగింది. పొడగ్తలతో ప్రారంభమైన సమావేశం కొద్దిసేపటికే వాగ్వాదానికి దారి తీసింది.

Update: 2025-03-01 09:09 GMT

Zelensky: ట్రంప్ తో వాగ్వాదం..విచారకరం..ట్రంప్‌తో జరిగిన వాగ్వాదంపై మౌనం వీడిన జెలెన్స్కీ

Trump-Zelensky: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మధ్య సమావేశం ఊహించని మలుపు తిరిగింది. పొడగ్తలతో ప్రారంభమైన సమావేశం కొద్దిసేపటికే వాగ్వాదానికి దారి తీసింది. దీంతో ఎలాంటి ఒప్పందం జరగకుండానే జెలెన్‌స్కీ వైట్ హౌస్‌ను వీడారు. అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జెలెన్ స్కీ మీడియా ఎదుటే వాగ్వాదానికి దిగడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

ట్రంప్, జెలెన్ స్కీ మధ్య సజావుగా మొదలైన భేటీ కాసేపటికే వాగ్వాదానికి దారితీసింది. ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని.. జెలెస్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. ఆ సమయంలో ఇరుదేశాల రాయబారులు ఎదురుగానే ఉన్నారు. ట్రంప్ మాటలు, జెలెన్ స్కీ ప్రతిస్పందనతో ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా మార్కరోవా ఆందోళనకు గురయ్యారు. అయ్యో ఇలా జరుగుతుందేంటి..? అన్నట్టుగా తల పట్టుకున్నారు. ఆమె హవభావాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్ స్కీ శుక్రవారం వైట్ హౌస్ కి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైన దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్ స్కీ ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్‌కు కోపం తెప్పించింది. దీంతో చర్చలు అర్థంతరంగా ముగిసిపోయాయి. ఒప్పందం పై ఎలాంటి సంతకాలు చేయకుండానే జెలెన్ స్కీ, వైట్ హౌస్ నుంచి వెళ్లి పోయారు. అనంతరం దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇలాంటి ఘర్షణలు ఇరు పక్షాలకు మంచిది కాదన్నారు.

జెలెన్ స్కీ తీరును ఉక్రెయిన్ ప్రజలు మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా కీర్తిస్తూ అతనికి జేజేలు పలుకుతున్నారు. వైట్ హౌస్‌తో యుద్ధం చేశారంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అంతేకాదు. బ్రిటన్, ఫ్రాన్స్ నుంచి కూడా జెలెన్ స్కీకి మద్దతు లభిస్తుంది. దేశం కోసం జెలెన్ స్కీ ప్రదర్శించిన తెగువను యూరప్ మెచ్చుకుంటోంది. జెలెన్ స్కీ చేసింది కలెక్టే అంటున్నారు.

మరోవైపు ట్రంప్, జెలెన్ స్కీ మధ్య జరిగిన వాగ్వాదం పై రష్య స్పందించింది. జెలెన్ స్కీకి ఇలా జరగాల్సిందేనని ఆరోపించింది. అమెరికా పట్ల అమర్యాదగా ఉన్న ఉక్రెయిన్ కు ఈ పరిణామం గట్టి చెంపదెబ్బని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు తమకు అన్నం పెట్టిన చేతినే గాయపరుస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోరా ఆరోపించారు. జెలెన్ స్కీ తమకు సాయం చేసిన వారితోనే వాగ్వాదానికి దిగారని.. ఆయనపై దాడి చేయకుండా ట్రంప్, జెడీ వాన్స్ సంయమనం పాటించడం అద్బుతమన్నారు.

మొత్తానికి వైట్ హౌజ్‌లో ట్రంప్, జెలెన్ స్కీ మధ్య వాదనలు సర్వత్రా చర్చనీయాంశమైంది. ట్రంప్‌తో హౌట్ హౌస్ లో యుద్ధం చేసిన జెలెన్ స్కీని ఆ దేశ ప్రజలు ఓ హీరోగా ప్రశంసిస్తున్నారు.


Tags:    

Similar News