Saudi Arebia: 610కేజీల బరువుతో వార్తల్లో నిలిచిన వ్యక్తి 60కేజీలకు తగ్గాడు..ఎలాగో తెలుసా?
Saudi Arebia: 610 కేజీల బరువుతో వార్తల్లో నిలిచిన వ్యక్తి ఇప్పుడు 60కేజీలకు తగ్గి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. 610 కేజీల బరువున్న వ్యక్తి 60కేజీలకు తగ్గడం ఎలా సాధ్యమైంది. పూర్తి వివరాలివే.
Saudi Arebia: 610కేజీల బరువుతో వార్తల్లో నిలిచిన వ్యక్తి 60కేజీలకు తగ్గాడు..ఎలాగో తెలుసా?
Saudi Arebia: ప్రపంచంలోనే అత్యధిక బరువు ఉన్న వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. కానీ ఇప్పుడు 60కేజీలకు తగ్గి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఓ రాజు అందించిన సహకారం ఆ వ్యక్తికి వరంగా మారింది. అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించిన వివరాల ప్రకారం చూస్తే...
సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ బిన్ మొహసేన్ షారీ...అత్యధిక బరువుతో ఎన్నో ఇబ్బందులు పడేవాడు. 2013లో 610 కేజీల బరువుతో ప్రపంచంలోనే అత్యధిక బరువు ఉన్న వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. దాంతో ఆయన మూడేండ్ల పాటు మంచానికే పరిమితం అయ్యాడు. తన పనులు తాను చేసుకోలేని పరిస్థితికి దిగజారిపోయాడు. ఖలీద్ స్టోరీ విన్నారు అప్పటి సౌదీ రాజు అబ్దుల్లా. అతని ప్రాణాలు కాపాడేందుకు నిర్ణయించుకున్నారు. తన సొంత డబ్బుతో ఖలీద్ కు వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. ప్రత్యేకంగా ఒక బెడ్ తయారు చేయించి ఇచ్చారు. అంతేకాదు అతన్ని రియాద్ లోని కింగ్ ఫాహద్ మెడికల్ సిటీకి తరలించి..30 మంది వైద్యులు ఎప్పటికప్పుడు అతనికి చికిత్స అందిస్తూ డైట్ చార్ట్ ను రెడీ చేశారు.
గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేసి..శరీరంలో కదలికలను పునరుద్ధరించేందుకు వ్యాయామాలు చేయించారు. ఫిజియోథెరపీ నిర్వహించేవారు. దాంతో 6 నెలల్లో సగానికి సగం బరువు తగ్గాడు. 2023ల 542 కేజీలు తగ్గి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. దాంతో 600కేజీలున్న వ్యక్తి కాస్తా 60కేజీల ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు. అదనపు చర్మం తొలగింపు కోసం శస్త్ర చికిత్సలు చేశారు. సరికొత్త రూపు సంతరించుకున్న ఆయన్ను ఇప్పుడు అంతా స్మైలింగ్ మ్యాన్ అంటూ పిలవడం ప్రారంభించారు. భారీకాయుడైన ఖలీద్..నాజూకు వ్యక్తిగా మారిన క్రమాన్ని గమనించిన వైద్య సిబ్బంది ఆయనకు ఆ పేరు పెట్టారు.