ప్రపంచవ్యాప్తంగా పదిలక్షలకు చేరువలో కరోనా బాధితులు.. భారత్ లో రెండు వేలు దాటిన పాజిటివ్ కేసులు!

చైనాలో మొదలైన కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్ని అలెర్ట్ అయ్యాయి..

Update: 2020-04-02 16:49 GMT
Representation Image

చైనాలో మొదలైన కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఇప్పుడు ప్రపంచ దేశాలు అన్ని అలెర్ట్ అయ్యాయి.. దాదాపుగా అన్ని దేశాలలో లాక్ డౌన్ తో స్తంభించిపోయాయి. అయినప్పటికీ కరోనా పాజిటివ్ సంఖ్య మాత్రం ఆగడం లేదు. ఏప్రిల్ 02 (గురువారం) రాత్రి 9 గంటల సమయానికి ప్రపంచ వ్యాప్తంగా 9,62,977 కేసులు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 7,10, 867 కేసులు చికిత్సలోనే ఉన్నాయి. ఇక 2,02, 935 మంది కరోనా వైరస్ బారి నుంచి బయటపడ్డారు. అదేవిధంగా మరణించిన వారి సంఖ్య 49,180 కి చేరింది.

ఇక భారతదేశ విషయానికి వచ్చేసరికి దేశంలో 2,069 కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. వాటిలో 1,860 మంది పాజిటివ్ వచ్చినవారు చికిత్స పొందుతున్నారు. వీరిలో కోలుకున్న వారి సంఖ్య 155 కాగా, మరణించిన వారి సంఖ్య 53 కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో 143  కేసులు నిర్ధారణ కాగా, 141 పాజిటివ్ కేసులు చికిత్స లో ఉన్నారు. ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 2 ఉండగా, ఇక మరణించిన వారు లేరు.

ఇక తెలంగాణా రాష్ట్రంలో 154 కేసులు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 17 మంది కోలుకున్నారు. ఇంకా 128 మంది కరోనా తో పోరాడుతూ చికిత్స పొందుతున్నారు. తెలంగాణాలో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 9 గా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.



Tags:    

Similar News