WHO: ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణం

కోవిడ్ విషయంలో ముందుగా ప్రపంచాన్ని హెచ్చరించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఘోరంగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

Update: 2021-05-15 15:55 GMT

WHO: ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణం (ఫొటో ట్విట్టర్)

WHO: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ కోవిడ్ విషయంలో ముందుగా ప్రపంచాన్ని హెచ్చరించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఘోరంగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా వల్ల క్రితం ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించింది. ఒ పక్క ఒలింపిక్స్ ను రద్దు చేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జపాన్‌లో అత్యవసర పరిస్థితిని పొడిగించారు. ఇలాంటి సమయంలోనే డబ్ల్యూహెచ్‌ఓ ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం.

"ఈ ఏడాది మొదటి వేవ్ కంటే చాలా ప్రమాదకరంగా ఉండబోతోంది. మేం ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులను అంచనా వేస్తున్నామని" ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 33,46,813 మంది చనిపోయారని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌కు పది వారరాల సమయం మాతరమే ఉంది. జపాన్ వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. కాగా, జపాన్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో మరో మూడు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది జపాన్ ప్రభుత్వం. ఇప్పటికే ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని 3,50,000 మంది సంతకాలు చేసిన పిటిషన్‌ను ప్రభుత్వానికి అందించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News