ప్రపంచంలో సంతోషంగా ఉన్న దేశాల్లో ఇండియా, అమెరికా, బ్రిటన్ ర్యాంక్స్ ఎంతో తెలుసా?

Update: 2025-03-20 10:38 GMT

World Happiness report 2025: ప్రపంచంలో ఎక్కువ సంతోషంగా ఉన్న దేశాలు... ఇండియా ర్యాంక్ ఎంత?

World's happiest countries list 2025: ప్రపంచంలో ఏయే దేశాలు ఎక్కువ సంతోషంగా ఉన్నాయో, ఏయే దేశాలు సంతోషంగా లేవో చెప్పే నివేదిక వచ్చేసింది. వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2025 గురువారం విడుదలైంది. ఆ రిపోర్ట్ ప్రకారం సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో ఫిన్‌ల్యాండ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇలా ఫిన్‌ల్యాండ్ ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకోవడం వరుసగా ఇది 8వ ఏడాది. అంతేకాదు... మొదటి నాలుగు దేశాల జాబితాలో ఎప్పటిలాగే ఫిన్ ల్యాండ్ తరువాత డెన్మార్క్, ఐస్ లాండ్, స్విడెన్ దేశాలు ఉన్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలోని వెల్ బీయింగ్ రిసెర్చ్ సెంటర్ ఈ వివరాలను వెల్లడిస్తోంది.

ఆయా దేశాల జనం వారి జీవన ప్రమాణాలు, బతుకుతున్న తీరుతెన్నుల ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు. సంతోషంగా ఉండటం అంటే కేవలం బాగా డబ్బు సంపాదించడమో లేక అభివృద్ధి చెందడమో దానికి ప్రాతిపదిక కాదని ఈ సర్వేకు సహకరించిన గ్యాలప్ సంస్థ సీఈఓ జాన్ క్లిఫ్టన్ అభిప్రాయపడ్డారు. ఒకరి నుండి మరొకరు పరస్పరం ఏం కోరుకుంటున్నారో అది నెరవేరితే ఆ సమాజం సంతోషంగా ఉంటుందన్నారు. ఒకరికొకరు అండగా నిలవడం, భరోసాను ఇవ్వడం, నమ్మకంగా ఉండటం కూడా సంతోషానికి బాటలు వేస్తుందని తెలిపారు. ఒంటరిగా భోజనం చేయకుండా ఇంట్లో కుటుంబసభ్యులు అంతా కలిసి భోజనం షేర్ చేసుకోవడం కూడా అలాంటిదేనని అన్నారు.

ఇండియా స్థానం ఎక్కడ?

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 లో భారత్ 10 కి 4.389 స్కోర్‌తో 118వ స్థానంలో ఉంది. గత కొన్నేళ్లుగా ఈ జాబితాలో ఇండియా స్థానం తరచుగా మారుతూ వస్తోంది. ఇండియా ఇప్పటివరకు 94వ స్థానం కంటే ముందుకు రాలేదు. 2022 లో ఇండియా ఈ జాబితాలో 94వ స్థానంలో నిలిచింది. 2012 లో 144వ స్థానంతో అత్యంత దిగువకు వెళ్లింది.

ఎప్పటికంటే కిందకు పడిపోయిన అమెరికా స్థానం

సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా 2012 లో 11వ స్థానంతో తొలిసారిగా బెస్ట్ ర్యాంక్ అనిపించుకుంది. ఈ ఏడాది ఆ ర్యాంక్ 24 కు పడిపోయింది. అమెరికా చరిత్రలో ఇంత దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి. గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో ఒంటరిగా భోజనం చేస్తోన్న వారి సంఖ్య 53 శాతం పెరిగిపోయిందని ఈ నివేదిక వెల్లడించింది.

ఈ జాబితాలోని టాప్ 20లో ఐరోపా దేశాలు ఎక్కువ స్థానాలు సొంతం చేసుకున్నాయి. విచిత్రం ఏంటంటే... గత ఏడాది కాలంగా యుద్ధం జరుగుతున్న ఇజ్రాయెల్ కూడా ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. కోస్టారికా 6వ స్థానం, మెక్సికో 10వ స్థానంతో మొట్టమొదటిసారిగా టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

బ్రిటన్ 23వ స్థానంలో నిలిచింది. అమెరికా కంటే బ్రిటన్ కేవలం ఒక స్థానం ముందుంది. 2017 తరువాత బ్రిటన్ మరీ ఇంత దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి.

ఇక సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో అట్టడుగు స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ నిలిచింది. ఆ తరువాత పశ్చిమ ఆఫ్రికాలోని సియర్రా లియోన్, ఇజ్రాయెల్ తో యుద్ధం చేసిన లెబనాన్ ఉన్నాయి.

టాప్ 20 దేశాల జాబితా ఇలా ఉంది

1) ఫిన్‌ల్యాండ్

2) డెన్మార్క్

3) ఐస్‌ల్యాండ్

4) స్విడెన్

5) నెదర్లాండ్స్

6) కోస్టారికా

7) నార్వె

8) ఇజ్రాయెల్

9) లక్సంబర్గ్

10) మెక్సికో

11) ఆస్ట్రేలియా

12) న్యూజిలాండ్

13) స్విట్జర్లాండ్

14) బెల్జియం

15) ఐర్లాండ్

16) లిత్వేనియా

17) ఆస్ట్రియా

18) కెనడా

19) స్లోవేనియా

20) చెకియా 

Countries with More Women Than Men: ఈ దేశాల్లో మగాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువ

Full View

New York Grand Central Station: గిన్నిస్ బుక్ రికార్డులకెక్కిన అద్భుతం!

Full View

More interesting stories: ఆసక్తికరమైన మరిన్ని వార్తా కథనాలు

కెనడా వచ్చి తప్పు చేశాను... పెద్ద చర్చకు దారితీసిన సోషల్ మీడియా పోస్ట్

సునీత విలియమ్స్ చిన్నప్పటి లక్ష్యం వేరు... చివరకు అయ్యింది వేరు

లక్షన్నర జీతం వస్తున్నా సరిపోవడం లేదంటున్న టెకీ... జనం రియాక్షన్ చూడండి

Tags:    

Similar News