Corona Cases in World: ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కలవరపెడుతున్న కరోనా
* వారంలో 21శాతం పెరిగిన మరణాలు * 8శాతం పెరిగిన కరోనా కేసులు * ఆగ్నేయాసియా దేశాల్లోనే 69 వేలకు పైగా మరణాలు
కరోనా వైరస్ (Representation Photo)
Corona Cases in World: తగ్గినట్టే తగ్గిన కరోనా మళ్లీ కలవరపెడుతుంది.పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్త వేరియంట్ల రూపంలో వైరస్ పంజా విసురుతోంది. అనేక దేశాల్లో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. వారంలో ప్రపంచ వ్యాప్తంగా మరణాల సంఖ్య 21 శాతం పెరిగాయి. వీటిలో దాదాపు 69 వేలకు పైగా మరణాలు ఆగ్నేయాసియా దేశాల్లోనే నమోదయ్యాయి. అలాగే కరోనా కేసులు కూడా 8 శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఇప్పటి వరకు మొత్తం 194 మిలియన్ల కరోనా కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. రాబోయే రెండు వారాల్లో కేసుల సంఖ్య 200 మిలియన్లను దాటేస్తుందని తెలిపింది. అమెరికా, ఇండియా, బ్రెజిల్, ఇండోనేషియా, యూకేలలో భారీగా కేసులు నమోదవుతున్నాయని ప్రకటించింది. యూరప్ మినహా అన్ని దేశాల్లో కరోనా మరణాలు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.