5 రెట్లు ఎక్కువ ఖర్చు... అయినా ట్రంప్ మిలిటరీ విమానాలే ఎందుకు పంపిస్తున్నారో తెలుసా?
Why Donald Trump using US Airforce planes for mass deportation: 5 రెట్లు ఎక్కువ ఖర్చు... అయినా ట్రంప్ మిలిటరీ విమానాలే ఎందుకు పంపిస్తున్నారో తెలుసా?
Why Donald Trump using US Airforce planes for mass deportation:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడ నివాసం ఉంటున్న అక్రమ వలసదారులను వారి సొంత దేశాలకు పంపిస్తున్నారు. అందుకోసం అమెరికా మిలిటరీ విమానాలు ఉపయోగిస్తున్నారు.
అయితే, ఇక్కడే చాలా మందికి ఒక సందేహం కలుగుతోంది. అదేంటంటే... వాస్తవానికి ఇతర ఎయిర్‌లైన్స్ విమానాల్లో ఫస్ట్ క్లాస్ టిక్కెట్ బుక్ చేసి పంపిస్తే అయ్యే ఖర్చు కంటే, మిలిటరీ విమానాల్లో పంపడానికి ఎక్కువ ఖర్చు అవుతోంది. మరి అయినా కూడా ట్రంప్ ఇల్లీగల్ ఇమ్మిగ్రంట్స్‌ను మిలిటరీ విమానాల్లోనే ఎందుకు పంపిస్తున్నారు అని.
ఫస్ట్ క్లాస్ టికెట్‌కు ఎంత? మిలిటరీ ఫ్లైట్ ఖర్చు ఎంత?
ఉదాహరణకు అమెరికా నుండి అక్కడికి సమీపంలోనే ఉన్న గ్వాటేమాల దేశానికి కూడా ఇలానే మిలిటరీ విమానాలు వెళ్లాయి. గ్వాటేమాలకు చెందిన అక్రమ వలసదారులను ఆ విమానాల్లో పంపించడానికి ఒక్కొక్కరికి 4,675 డాలర్ల చొప్పున ఖర్చయింది. ఇండియన్ కరెన్సీలో ఇది 4 లక్షలకు సమానం. ఒకవేళ వారిని వేరే విమానాల్లో ఫస్ట్ క్లాస్ టికెట్ ఇచ్చి పంపించి ఉంటే ఒక్కొక్కరికి జస్ట్ 853 డాలర్లు మాత్రమే ఖర్చయ్యేది. అంటే జస్ట్ 75 వేల రూపాయల్లోపే అయిపోయేదన్నమాట. అంటే ఐదు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతోంది.
దగ్గర్లో ఉన్న దేశానికే అయ్యే ఖర్చులోనే అంత తేడా ఉంటే... అమెరికా నుండి 24 గంటల ప్రయాణ దూరం ఉన్న ఇండియాకు పంపించే మిలిటరీ విమానానికి ఇంకెంత ఖర్చు రావాలి? అయినప్పటికీ ట్రంప్ మాత్రం అమెరికా మిలిటరీ విమానాలనే ఎందుకు ఉపయోగించారు? ఇదే ఇప్పుడు వరల్డ్ వైడ్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది.
ట్రంప్ అలా చేయడానికి కారణం అదేనా?
డొనల్డ్ ట్రంప్ ఏం చేసినా ఒక కాలిక్యులేషన్, ఒక పర్పస్ ఉంటుందంటారు. ఈ విషయంలో కూడా ట్రంప్ ప్రపంచ దేశాలకు, అక్రమ వలసదారులకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడానికే ఆ పని చేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా ఎవరినైనా ఒక వ్యక్తిని ఒక దేశం నుండి వారి సొంత దేశానికి డిపోర్ట్ చేసేటప్పుడు, విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని దగ్గరుండి ఆ దేశానికి వెళ్ళే ఏదో ఒక విమానం ఎక్కిస్తారు. ఒకవేళ వారికి ఏదైనా నేర చరిత్ర ఉన్నట్లయితే, వారితో పాటు సెక్యూరిటీని కూడా ఇచ్చి వెంట పంపిస్తారు. విమానంలో తిరుగు ప్రయాణంలో తోటి ప్రయాణికులకు వారి నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఆ పని చేస్తారు.
అయితే, అమెరికా ఇప్పుడు చేస్తోన్న పని మాస్ డిపోర్టేషన్. అంటే భారీ సంఖ్యలో అక్రమ వలసదారులను దేశం దాటించడం. అక్రమ వలసదారులను ట్రంప్ మొదటి నుండి నేరస్తులుగానే చూస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రచార సభల్లో కూడా అక్రమ వలసదారులను ట్రంప్ క్రిమినల్ ఏలియెన్స్ అనే సంభోదించారు. అందుకే వారిని గౌరవప్రదంగా రెగ్యులర్ ఫ్లైట్స్‌లో పంపించడం ఆయనకు ఇష్టం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.
పైగా ఇలా మిలిటరీ విమానాల్లో పంపించడం ద్వారా అమెరికా వారిని నేరస్తులుగా చూస్తోందనే సంకేతాలు ఇచ్చారు. ఇకపై కూడా ఇలా అమెరికాలోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశించినా... లేదా వీసా గడువు ముగిసిన తరువాత కూడా ఇంకా అక్రమంగా అమెరికాలోనే ఉండే వారికి ఇదే ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పకనే చెప్పారు. అందుకే ఖర్చు ఎక్కువైనా సరే ఇలా మిలిటరీ ఫ్లైట్స్‌లోనే పంపిస్తున్నారని ట్రంప్ వైఖరిని విశ్లేషిస్తున్న వారు చెబుతున్నారు.
ఇందులో ఇంకొక హిడెన్ సీక్రెట్ కూడా లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికా నుండి అక్రమ వలసదారులతో వెళ్లే విమానాలకు ఏదైనా హాని చేయాలని ఎవరైనా అసాంఘీక శక్తులు కుట్ర చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? పవర్‌ఫుల్ కంట్రీ అని చెప్పుకునే అమెరికాకు చెడ్డ పేరు తేవాలని ఎవరైనా అసాంఘీక శక్తులు కుట్ర పన్నితే ఎలా? అలాంటప్పుడు అది ఒక్క అమెరికా ప్రాబ్లం కాదు... రెండు దేశాల ప్రభుత్వాలు, పౌరుల సమస్య అవుతుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఒసామా బిన్ లాడెన్ చేయించిన దాడి ఘటన అమెరికాపై ప్రతీకారంలోంచి వచ్చిందే కదా? ఇవన్నీ జస్ట్ ప్రశ్నలు మాత్రమే. అసాంఘీక శక్తులకు అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదంటే అమెరికా జాగ్రత్తపడాల్సిందే కదా!!
అమెరికా ఎయిర్స్ ఫోర్స్ విమానాలు అత్యంత పవర్‌ఫుల్ ఫ్లైట్స్. ఎవరైనా అసాంఘీక శక్తులు సాధారణ విమానాలను హైజాక్ చేయగలరేమో కానీ అమెరికా ఎయిర్ ఫోర్స్ విమానాలను టచ్ చేయాలనే ఆలోచన కూడా చేయలేరు. అమెరికా నుండి డిపోర్ట్ అయ్యే వారంతా విదేశీయులే. వారికి భద్రత కల్పించడంలో విఫలమైతే అది అమెరికా దేశానికే మాయని మచ్చలా మిగిలిపోతుంది. అందుకోసం కూడా డోనల్డ్ ట్రంప్ ఇలా వ్యవహరించి ఉండొచ్చనే వాళ్లు కూడా లేకపోలేదు.
Also watch this video - Modi meets Donald Trump: మోదీ అమెరికా పర్యటన ఫలించిందా? భారత్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గారా?